Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ఈ యేడాది ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’లో నటించింది. ఈ సినిమా ఫెయిల్ కావడంతో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు ఈ భామ అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉంది. (Instagram/Photo)
ఈ సినిమా విడుదల సందర్భంగా మీనాక్షి చౌదరి ‘హిట్ 2’ మూవీ ప్రమోషన్స్‌లో జోరుగా నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు యూత్ ఎక్కువగా ఉండే కాలేజీలను చుట్టేసింది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా దాదాపు రూ. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లోకి ఎంటరైంది. (Instagram/Photo)