May Most Awaited Movies : 2022లో జనవరిలో కరోనా థర్డ్ వేవ్ కారణంగా చెప్పుకోదగ్గ సినిమాలేవి రాలేదు. ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక మార్చి నెలలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ యేడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఏప్రిల్‌లో డబ్బింగ్ మూవీ ‘కేజీఎఫ్ 2’ బాక్పాఫీస్ దగ్గర రఫ్పాడించింది. ఇక మే నెలలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల కానుంది. వాటితో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘F3’ సినిమా థియేటర్స్‌లో పలకరించనున్నాయి. వాటితో పాటు సుమ జయమ్మ పంచాయితీతో పాటు శ్రీ విష్ణు భళాతందనాన’ తో పాటు అశోకవనంలో అర్జున కళ్యాణం, శేఖర్, గాడ్సే, కృష్ణ వ్రిందా విహారి సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. (Twitter/Photo)
అశోకవనంలో అర్జున కళ్యాణం | విశ్వక్సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. విద్యాసాగర్ చింతా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కేజీఎఫ్, ఆచార్య సినిమాలకు భయపడి ఈ సినిమా మే 6న విడుల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లో విశ్వక్సేన్ చేసిన ఫ్రాంక్ వీడియో ఇపుడు సంచలనంగా మారింది. (Twitter/Photo)
సర్కారు వారి పాట | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా చేసారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా విడుదలకు మరో 9రోజులు మాత్రమే మిగిలి ఉంది. మే నెలలో ప్రేక్షకులు ఎక్కువ మంది ఎదురు చూసే మూవీ ఇదే. ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. Mahesh Babu Photo : Twitter
కృష్ణ వ్రింద విహారి | నాగ శౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని అనీష్ కృప్ణ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 22న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా.. తాజాగా ఈ సినిమాను మే 20న విడుదల చేయనున్నారు. (Twitter/Photo)
F3 | విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘F3’. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాపై టాలీవుడ్లో ఎన్నో అంచనాలున్నాయి. దిల్ రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా మే 27న విడుదల కానుంది. (Twitter/Photo)
మొత్తంగా ‘భళా తందనాన’ జయమ్మ పంచాయితీతో మొదలు పెడితే.. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ , ఎఫ్ 3 తో పాటు పలు క్రేజీ సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇందులో ‘సర్కారు వారి పాట’, ఎఫ్ 3’ సినిమాలకు మాత్రమే ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది. ఈ సినిమాలో మే నెలలో ఏది హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అనిపించుకుంటుందో చూడాలి. (File/Photo)