కరోనా ఆపత్కకాలంలో రక్తదానం చేసిన విశ్వక్‌సేన్..

కరోనా కారణంగా దేశ మొత్తం లాక్ డౌన్ అయిన నేపథ్యంలో ర‌క్త దాత‌లు ఇంటికే ప‌రిమితం అయిపోవ‌డం వ‌ల్ల ఎక్క‌డా రక్తం దొర‌క‌డం లేదు. వారిలో స్పూర్తి నింపడానికి ఇప్పటికే నాని రక్తదానం చేసిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు చిరంజీవి కూడా తన పేరిట ఉన్న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌లో రక్తదానం చేసిన సంగతి తెలిసిందే కదా. కరోనా కారణంగా తలసేమియా పేషెంట్స్‌తో పాటు గర్భిణులకు అత్యవరసమైన వాళ్లకు రక్తం లేకుండా పోతుంది. తాజాగా చిరంజీవి పిలుపు మేరకు విశ్వక్‌సేన్.. చిరుకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్‌లో శనివారం రక్త దానం చేసాడు.