మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా.. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించారు పెళ్లి సందD భామ శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. Photo : Twitter
భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా 2022 డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. రెగ్యులర్ మాస్ తరహా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బీ,సీ సెంటర్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. యాక్షన్ ఎంటర్టేనరర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఈ సినిమా హైయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కించారు. నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. Photo : Twitter
రవితేజ గత సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో చేశారు. అందుకు తగ్గట్టే ఈ సినిమాతో రవితేజ మరోసారి బ్యాక్ బౌన్స్ అయ్యారు. ఇక రవితేజ గతంలో నటించిన సినిమాల విషయానికి వస్తే.. ఆ మధ్య రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ఖిలాడీ సినిమా, శరత్ మండవ దర్శకత్వంలో చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు రెండు కూడా ప్లాప్ అయ్యాయి . Photo : Twitter
రవితేజ కెరీర్లోనే టాప్ హిట్‌గా నిలిచిన ధమాకా జనవరి 22 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐదు రోజుల క్రితం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్‌గా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అదరగొడుతోంది. ధమాకా నెట్‌ఫ్లిక్స్‌లో భారీ వ్యూయర్షిప్ను సాధిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ఈ వారం ఇండియాలో టాప్ 10 సినిమాల లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో టీమ్ దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. . Photo : Twitter
ఇక ధమాకా’ చిత్రం నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు రూ. 30 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 10 కోట్లుకు పలికాయట. మరోవైపు శాటిలైట్,డిజిటల్ హక్కులు రూ. 20 కోట్లు పలికాయట. క్రాక్ తర్వాత రవితేజ నటించిన ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు ఫ్లాప్ అయిన ఈ మూవీకి ఈ రేటు పలకడం మాములు విషయం కాదు. Photo : Twitter
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కినా రవితేజ వరుసగా మళ్ళీ రెండు ప్లాపులతో కాస్తా వెనుకబడ్డారు. ఈ యేడాది రవితేజ నుంచి వచ్చిన మూడో చిత్రం ఇది. తెలంగాణ (నైజాం).. రూ. 5.5 కోట్లు.. రాయలసీమ (సీడెడ్).. రూ. 2.5 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్.. రూ. 8 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 16 కోట్లు.. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + ఓవర్సీస్.. రూ. 2.30 కోట్లు.. టోటల్ రూ. 18.30 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హిట్ అనిపించుకోవాలంటే ఈ సినిమా రూ. 19 కోట్లు రాబట్టాలి. Photo : Twitter
ధమాకా మూవీ.. తెలంగాణ (నైజాం)లో రూ. 228 స్క్రీన్స్‌లో .. మరోవైపు రాయలసీమలో 160 స్క్రీన్స్.. ఆంధ్ర ప్రదేశ్‌లో 280 థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలైంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిప ిఈ సినిమా 670 పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ భారత్ కలిపి 70 + ఓవర్సీస్లో 200 స్క్రీన్స్‌లో రిలీజైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 940 పైగా స్క్రీన్స్‌లో ధమాకా సినిమా విడుదలైంది. ఓ రకంగా ధమాకాకు ఈ రేంజ్ థియేటర్స్ దక్కడం మాములు విషయం కాదు.అందుకు తగ్గట్టే వసూళ్లను సాధించింది రవితేజ ధమాకా. Photo : Twitter
రవితేజ గత సినిమాల విషయానికొస్తే.. రామారావు ఆన్ డ్యూటీ.. రూ. 17.20 కోట్లు.. ఖిలాడీ మూవీ రూ. 22.80 కోట్లు.. క్రాక్ .. రూ. 17 కోట్లు.. డిస్కో రాజా మూవీ రూ. 19.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరుస ఫ్లాపులున్న ‘ధమాకా’ మూవీకి ఈ రేంజ్ బిజినెస్ జరగడం మాములు విషయం కాదు. ఇక రవితేజ .. చిరంజీవితో నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై కేకపెట్టించింది. (Twitter/Photo)
ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. నుపుర్ సనన్ (Nupur Sanon) విషయానికొస్తే.. ఈమె ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు. మరో హీరోయిన్గా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు. ఈ సినిమాతో పాటు రవితేజ రావణసుర అనే మరో సినిమా కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. Photo : Twitter