రవితేజ తెలుగులో అదిరిపోయే మాస్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులు ముద్దుగా మాస్ రాజా అని పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు ఆయనని ముద్దుల రాజా అని కూడా పిలవాల్సి వస్తుంది. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. లిప్ లాక్ సన్నివేశాల్లో రవితేజ రెగ్యులర్గా నటిస్తున్నాడు. అదేంటి మాస్ రాజా ఇప్పుడు ముద్దు సన్నివేశాలు చేశాడు అనుకుంటున్నారా..?
ఒక్కసారి ఆయన కెరీర్ తిరగేసి చూస్తే నాలుగైదు సినిమాలలో ఘాటు ముద్దు సీన్ లో నటించాడు రవితేజ. రొమాంటిక్ సీన్స్ చేయడంలో మాస్ రాజాది ప్రత్యేకమైన శైలి అప్పట్లో కిక్ సినిమాలో ఇలియానా, రవితేజ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్ బాగా వైరల్ అయింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలలో అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ చేశాడు రవితేజ.
ఇక కొన్నేళ్లుగా ఈయన కూడా అప్డేట్ అయ్యాడు. నేటి తరానికి నచ్చేలా లిప్ లాక్ సన్నివేశాలు కూడా చేస్తున్నాడు మాస్ రాజా. తాజాగా విడుదలకు సిద్ధమైన ఖిలాడీ సినిమాలో కూడా ఈ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. డింపుల్ హయాతితో మాస్ రాజా చేసిన ఒక లిప్ లాక్ సీన్ ఇప్పుడు లీక్ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.