ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న మసూద ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది
ఈ సంద్భంగా రామానాయుడు స్టూడియో లో థాంక్యూ మీట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, లగడపాటి శ్రీధర్, హీరో సుమంత్, సుహాస్ డైరెక్టర్ సందీప్ రాజ్,శుభలేఖ సుధాకర్, జూబ్లీ హిల్స్ కంటే స్ట్ ఎమ్ ఏల్ ఏ నవీన్ యాదవ్, డైరెక్టర్ భరత్ కమ్మ, డైరెక్టర్ వినోద్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. రాహుల్ యాదవ్ టేస్ట్ కు తగ్గట్టు కథను, దర్శకుడు గౌతమ్ ను సెలెక్ట్ చేసుకొని "మళ్ళీ రావా" సినిమా చేసి హిట్ కొట్టాడు, ఆ తరువాత "ఏజెంట్ ఆత్రేయ" సినిమా తీసి మళ్ళీ హిట్ కొట్టి, ఇప్పుడు దర్శకుడు సాయి కిరణ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం అనేది గ్రేట్ .ఒక నిర్మాత ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు సినిమా తియ్యాలి అనుకుని, మంచి సంకల్పం తో సినిమాకు ప్రాణం పెట్టి తీస్తే హిట్ రిజల్ట్ వస్తాయి అని ఈ జనరేషన్ లో రాహుల్ ప్రూవ్ చేశాడని కొనియాాడారు. (Twitter/Photo)
తన హోమ్ బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు హిట్ సాధించిన రాహుల్ కు & టీం కు కంగ్రాట్స్. ఇక నుండి రాహుల్ ఈ సక్సెస్ ను కాపాడుకోవడం కూడా బిగ్ టాస్క్.నవంబర్ 18 న "మసూద" ఆ తరువాత "లవ్ టుడే", "హిట్ 2" ఇలా వరుసగా మూడు సినిమాలు హిట్ సాధించడం చూస్తుంటే ఇండస్ట్రీ కి మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. మంచి సినిమాలకు సీజన్ అంటూ ఉండదు. ఇలాంటి మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని "మసూద" మళ్ళీ ప్రూవ్ చేసింది. రాహుల్ తన బ్యానర్ లో ఇలాంటి మంచి సినిమాలు చాలా తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిత్ర యూనిట్ అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ.. రాహుల్ తో గత ఆరు సంవత్సరాలనుండి జర్నీ చేస్తున్నాను. తన బ్యానర్ లో మెదటి సినిమా "మళ్ళీ రావా" చేశాను. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. చాలా రోజుల తర్వాత రియలిస్టిక్ హారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హ్యాట్రిక్ హిట్ సాధించిన రాహుల్ కు కంగ్రాట్స్ తెలియ జేస్తున్నాను. ఇంత పెద్ద హిట్ సాధించిన మసూద టీం సభ్యులందరికీ అల్ ద బెస్ట్ అన్నారు (Twitter/Photo)
నిర్మాత బేక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ... ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకొని సినిమా తియ్యడమే కాకుండా ఎంతో దైర్యంగా సినిమాను రిలీజ్ చేసి బిగ్ హిట్ సాధించాడు. ఇందులో తిరువీర్ ,సంగీత, అఖిల ఇలా ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు.ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడిని థ్రిల్ కు గురి చేస్తుంది. ఇంకా చూడని వారుంటే చూసి ఈ సినిమాను ఇంకా బిగ్ సక్సెస్ చెయ్యాలి అన్నారు. (Twitter/Photo)
నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ..ఈ సినిమా విడుదలైన మూడవ వారంలో కూడా మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. నేను ఇంజనీరింగ్ చేసిన తరువాత సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యి ఒరిస్సాలో ఒక ప్రాజెక్టు చేసి, మళ్ళీ ఇక్కడకు వచ్చి ,చివరకు ఫిల్మ్ ఇండస్ట్రీ కి రావడం జరిగింది. నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మా నాన్నే. తన దగ్గర నుండే హార్డ్ వర్క్ ఎలా చెయ్యాలో నేర్చుకొన్నాను.తనే నన్ను ముందుండి నడిపించాడు.ఇలా నా ఫ్యామిలీ అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేయడం వలెనే మూడు సినిమాలు బిగ్ హిట్స్ అయ్యాయి. వారి సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండేవాన్ని కాదంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. (Twitter/Photo)
’మసూద’ చిత్రాన్ని ఎస్విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. మసూద చిత్ర విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో వచ్చిన రెగ్యులర్ హార్రర్ చిత్రాల్లో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కొత్ద దర్శకుడు సాయి కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు.