అవును మారుతి తన రూట్ మార్చుకోకపోతే.. దర్శకుడిగా కెరీర్ ఖతం అయినట్టే అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. తాజాగా ఈయన గోపీచంద్ హీరోగా తెరకెక్కించిన ‘పక్కా కమర్షియల్’ మూవీ కమర్షియల్‌గా పెద్దగా వర్కౌట్ కాలేదు. థియేట్రికల్‌గా ఈ సినిమా లాస్ తీసుకొచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు డిజిటల్, శాటిలైట్ రూపంలో తీసుకుంటే పక్కా కమర్షియల్ ప్రాజెక్ట్ సేఫ్ అయినట్టే అని చెప్పాలి. (Twitter/Photo)
ప్రభాస్‌తో మారుతి చేయబోయే ‘రాజా డీలక్స్’ మూవీని హార్రర్ కామెడీగా తెరకెక్కించబోతున్నట్టు చెబుతున్నారు. గతంలో ఈయన దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘ప్రేమ కథా చిత్రం’ టైపు తెరకెక్కిస్తాడా అనేది చూడాలి. ఈ చిత్రాన్ని మారుతి కేవలం 40 రోజుల్లో పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే మారుతి తన స్క్రిప్ట్‌తో ప్రభాస్‌ను ఇంప్రెస్ చేశారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. కథ ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌కు ఛాన్స్ ఉందట. అందులో ఒక హీరోయిన్గా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీలను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. మరి ప్రభాస్‌తో రెగ్యులర్ హార్రర్ కామెడీతో హిట్ అందిస్తాడా అనేది చూడాలి. లేకపోతే దర్శకుడిగా మారుతి కెరీర్ డైలామాలో పడినట్టే.. (Twitter/Photo)
పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతితో సినిమా చేయబోతున్నట్టు చిరంజీవి మాట ఇచ్చారు. కానీ అందుకు మారుతి.. ప్రభాస్‌తో సినిమా చేయడంతో సరిపోదు. హిట్ కొట్టాలి. సక్సెస్ అందుకుంటేనే చిరంజీవి సినిమా ఛాన్స్ వస్తోంది. లేకపోతే అంతే సంగతులు. గతంలో చిరంజీవి.. సుజిత్‌తో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తానని చెప్పి.. చివరి నిమిషంలో మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మారుతి పక్కా కమర్షియల్ రిజల్ట్తోనైనా తన పంథా మార్చుకొని తనను తాను కొత్తగా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)