Home » photogallery » movies »

MARCH MOVIES IN 2022 FROM RRR RADHE SHYAM ADAVALLU MEEKU JOHARLU TO RRR JAMES THESE ARE THE MOVIES PROGRESS REPORTS HITS AND FLOPS LIST MARCH 2022 TA

March Movies in 2022 : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా మార్చిలో విడుదలైన సినిమాలు.. అందులో హిట్స్ ఎన్నంటే..

March Movies in 2022 : జనవరి అంతా ఓమిక్రాన్ వేరియంట్ సినీ ఇండస్ట్రీని కలవరపాటుకు గురిచింది. ఆ తర్వాత కరోనా వైరస్ మెల్లగా తగ్గుతుండటంతో సినిమాలు వరసగా విడుదల అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల కావడం.. దానికి అదిరిపోయే కలెక్షన్స్ రావడంతో  మిగిలిన నిర్మాతలు కూడా ధైర్యం చేసారు. మార్చ్ అయితే పెద్ద సినిమాలకు అడ్డాగా మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలు కూడా ఇదే నెలలో రిలీజైయ్యాయి. అందులో రాజమౌళి ట్రిపుల్ ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. మరోవైపు తమిళం, కన్నడలలో కూడా భారీ సినిమాలు వచ్చాయి. మార్చ్ 4 నుంచి 25 వరకు వరసగా సినిమాలు థియేటర్స్‌లో విడుదలయ్యాయి. . ఇందులో ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి మార్చి నెలకు ఘనంగా వీడ్కోలు పలికింది. మొత్తంగా ఈ సినిమా  సహా మార్చి నెలలో వచ్చిన సినిమాలెన్ని.. ? ఎన్ని సినిమాలు విజయాలు సాధించాయో చూద్దాం.