March 2023 Tollywood Box Office Report: 2023 మార్చి నెలలలో బాక్సాఫీస్‌కు బాగానే కలిసొచ్చింది. నెల మొదట్లో ‘బలగం’ వంటి చిన్న సినిమా పెద్ద హిట్‌గా నిలిస్తే.. నెల చివర్లో నాని హీరోగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ ‘దసరా’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతూ దూసుకుపోతుంది. అటు విశ్వక్ సేన్ ‘దాస్ కా దమ్కీ’ సినిమాలు కూడా మంచి విజయాన్నే నమోదు చేసింది. మొత్తంగా మార్చి నెల బాక్సాఫీస్ రిపోర్ట్ విషయానికొస్తే..
బలగం | మార్చి 3న విడుదలైన తెలంగాణ పల్లె నేపథ్యంలో తెరకెక్కిన హృద్యమైన చిత్రం ‘బలగం’. కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ‘బలగం’ సినిమా. రూ. కోటి రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 11 కోట్లకు పైగా షేర్ రాబట్టి.. నిర్మాతకు పదింతల లాభాలను తీసుకొచ్చి సంచలన విజయం సాధించి మార్చికి శుభారంభం ఇచ్చింది.
దాస్ కా దమ్కీ | మార్చి 22న ఉగాది కానుకగా విడుదలైన మూవీ ‘దాస్ కా దమ్కీ’. విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దాస్ కా దమ్కీ’ ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరో కమ్ విలన్‌గా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా రూ. 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 11 కోట్లకు పైగా షేర్ రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
దసరా | నాని హీరోగా కీర్తి సురేష్ కథానాయికగా నటించిన మూవీ ‘దసరా’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజు నాని కెరీర్లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందనేది చూడాలి. (File/Photo)
మొత్తంగా బాక్సాఫీస్ బరిలో కాస్త పేరున్న చిత్రాలు అర డజనుకు పైగా విడుదలయ్యాయి. ఇందులో బలగం చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అటు ‘దాస్ కా దమ్కీ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. ఇక మార్చి చివర్లో విడుదలైన దసరా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొత్తంగా ‘బలగం’ వంటి హిట్ సినిమాతో మొదలై దసరా వంటి హిట్ చిత్రంతో మార్చి నెల ముగియడం విశేషం. (File/Photo)