Manisha Eerabathini : మనీషా ఈరబత్తిని... మంచి సింగరే కాదు.. ఓ అందాల ముద్దుగుమ్మ కూడా. మనీషా, అమెరికాలో ఉంటున్నప్పటికీ.. తెలుగు కళలపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి తెలుగు సినిమాల్లో పాటలు పాడుతూ.. తన లక్కు ను పరీక్షించుకుంటుంది. మనీషా.. క్లాసికల్, వెస్ట్రన్ కలిపి ఫ్యూజన్ మ్యూజిక్‌లో పాటలు పాడటంలో ప్రత్యేక శైలి. ఇప్పటికీ పలు చిత్రాల్లో గీతాలు ఆలపించిన మనీషా... తెలుగులో పాప్ సాంగ్స్ పాడే అతికొద్ది సింగర్స్లలో ఒకరు కావడం విశేషం.