పొన్నియన్ సెల్వన్.. ఈ సంవత్సరం తమిళ్ నుంచి విడుదలై భారీ సినిమాల్లో ఒకటి. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అనుకున్న విధంగా బాగానే ఆకట్టుకుంది. అయితే తెలుగులో మాత్రం పెద్దగా ఆదరణ పొందలేదు. దీనికి ఆ తమిళ నేటీవిటీ ప్రధాన కారణమని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా తెలుగులో అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేదు. అయితే అటు తమిళంలో మాత్రం మంచి వసూళ్లను రాబట్టింది. Photo : Twitter
చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి అలాగే ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి భారీ కాస్ట్ తో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పటికే తమిళ్ బాగానే రన్ అవుతోంది. కాగా సడెన్‌గా ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటిటిలో ప్రత్యేక్షమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్న ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్కు తీసుకువచ్చింది. అయితే ఇది ప్రస్తుతానికి అందరికీ అందుబాటులో లేదు. రెంటల్ రూపంలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాను చూడాలనుకుంటే ప్రైమ్ మెంబర్స్ అయినా కూడా అదనంగా 200 చెల్లించాలి. అయితే మరో వారంలో ఈ సినిమా ప్రైమ్ మెంబర్స్ అందరికి అందుబాటులోకి రానుంది. Photo : Twitter
ఈ సినిమాలో ముఖ్యపాత్రలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష నటించారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) విడుదల చేశారు. ఇక ఈ కథ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా తమిళ నేటీవిటిగా చెందిన కథ.. ఆ పేర్లు.. అవి.. అంత తమిళ పేర్లు అవ్వడంతో తెలుగు వారికి కనెక్టివిటీ కాస్తా తక్కువుగా ఉంటోంది.. Photo : Twitter
కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan - 1) నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను (Ponniyin Selvan - 1) తెరకెక్కించడం తన లైఫ్ టైమ్ డ్రీమ్ అంటూ మణిరత్నం ప్రకటించారు. బాహుబలి ఇచ్చిన సక్సెస్‌తో మణి రత్నం ఈ భారీ ప్రాజెక్ట్ చేపట్టాని ఆ మధ్య పేర్కోన్న సంగతి తెలిసిందే.. Photo : Twitter
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో, విక్రమ్ (Vikran) .. కార్తి (Karthi) .. జయం రవి (Jayam Ravi) .. శరత్ కుమార్ .. పార్తీబన్ .. ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) .. త్రిష (Trisha).. ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఏఆర్ రెహ్మాన్ (AR Rahman)గీతాన్ని సమకూర్చారు. Photo : Twitter
ఇక ఈ సినిమాను తెలంగాణలో మల్టీప్లెక్స్‌లో రూ. 295 విక్రయించడం అనేది ఈ సినిమాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇది అంత త్వరగా తెలుగువారికి కనెక్ట్ అయ్యే సినిమా కాదు.. ఆ కథ, పేర్లు.. అంతా తమిళ నేటీవిటికి చెందినది. ఈ క్రమంలో దాదాపుగా 300 రూపాయలు అంటే కష్టమే అంటున్నారు నెటిజన్స్.. Photo : Twitter
ఇక ఈ సినిమాను తెలుగులో మంచి బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం తెలంగాణ (నైజాం)లో రూ. 3.5 కోట్ల బిజినెస్ చేసింది. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 2 కోట్ల బిజినెస్ చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 4.5 కోట్ల రేంజ్లో బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. Photo : Twitter
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా, రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రం కూడా మొదటి భాగం నుండి రెండవ భాగం వరకు లీడ్ మరియు సస్పెన్స్ కొనసాగుతుంది అని తెలుస్తోంది. క్లైమాక్స్‌కి సంబంధించిన సన్నివేశాలు కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. Photo : Twitter