ఈ సినిమాలో మంచు విష్ణు మరోసారి తన కామెడీ యాంగిల్ చూపించబోతున్నారని తెలుస్తోంది. ఊరి నిండా అప్పులు చేసి.. టెంట్ హౌస్ నడుపుకునే యువకుడి పాత్రలో మంచు విష్ణు కనిపించబోతున్నారు. చిత్రంలో రఘుబాబు, చమ్మక్ చంద్ర కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం విశేషం.
ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. అనూప్ రూబెన్స్ బాణీలు కడుతుండగా.. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. పచ్చళ్ల స్వాతి పాత్రలో పాయల్ కనిపించనుంది. ఈ ముద్దుగుమ్మ రోల్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ కానుందట.