అక్కడ ఏం జరిగిందో నాకు కరెక్ట్ గా అయితే తెలియదు కానీ.. చిరంజీవి, ఆయన ఫ్యాన్స్ అదీ ఇదీ అంటూ గరికపాటి ఏదో మాట్లాడినట్లు ఉన్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం. చిరంజీవి గారు ఒక లెజెండ్. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు అభిమానులు ఫోటోలకు ఎగబడడం అనేది సహజంగా జరిగేదే. ఆ ఉత్సాహాన్ని కంట్రోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. పెద్ద స్టార్స్ వస్తే ఇలాంటి సంఘటనలు కామన్ అని అన్నారు మంచు విష్ణు.