రీసెంట్గా మంచు విష్ణు.. గరు తుల్యులైన దాసరి జయంతి సందర్భంగా ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణ రావును ఎవరు రీప్లేస్ చేయలేరు అంటూ ఇండస్ట్రీ పెద్దగా అప్పటికీ ఎప్పటికీ దాసరి నారాయణ రావు గారే ఉంటారు అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌ను మంచు విష్ణు చిరంజీవి ఉద్దేశించి ఆ ట్వీట్ చేసాడనేది బహిరంగం రహస్యం అని అందరు చెప్పుకున్నారు. (Twitter/Photo)
‘మా’ (Movie Artists Association) మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ‘మా’కు సంబంధించిన విషయాలపై దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇక బాధ్యతలు స్వీకరించిన రోజునే.. సీనియర్ నటులకు పెన్షన్ పథకంపై తొలి సంతకం చేశారు. అంతేకాదు ‘మా’ త్వరలో సొంత భవనానికి ఆరు నెలల్లో భూమి పూజా చేస్తానంటూ ప్రకటన చేశారు. (Twiitter/Photo)
తాజాగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు.. మా సభ్యుల ఆరోగ్యం సంక్షేమం.. ఆరోగ్యమే తనకు ప్రధాన ఎజెండా అన్నారు. తాజాగా ఈయన మా సభ్యుల కోసం ఏఐజీ హాస్పిటల్లో ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. మా సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసేందుకు ఏషయన్ ఇన్‌స్టూట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా మంచు విష్ణు థియేటర్స్‌లో టికెట్ ధరల విషయమై మాట్లాడుతూ... టికెట్ ధరల విషయంలో పెంచితే కొందరికీ.. తగ్గిస్తే మరికొందరికీ ఇబ్బందులు వస్తాయన్నారు.అందుకే నేను మా అధ్యక్షుడిగా ఈ విషయంలో మౌనంగా ఉన్నాన్నారు. టికెట్ల రేట్ల అంశం అనేది చాలా పెద్ద ఇష్యూ. దీనిపై తెలుగు ఫిల్మ్ టప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ అంతా కలిసి చర్చించి ఒక డిసిషన్‌కు రావాలన్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలను పక్కన పెడితే.. రీసెంట్గా చిరంజీవి ఆచార్యతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలకు ఒక వారం పాటు టిక్కెట్ రేట్స్ పెంచుకునేందకు ప్రభుత్వం నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
మొత్తంగా టికెట్ రేట్స్ పెరుగుదల పై మాట్లాడుతూనే మరోసారి చిరంజీవి, మహేష్ బాబులకు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టుగానే మాట్లాడినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రీసెంట్గా మంచు విష్ణు .. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చూసి సూపర్ స్టార్ యాక్టింగ్ సూపర్ అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
ఈ సందర్భంగా మా మాజీ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. సినీ నటుల కోసం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడాన్ని కొనియాడారు. ఇక మా సభ్యులకు సినిమాల్లో అవకాశాలు కల్పించే విధంగా నటుడు గౌతమ్ రాజు ఆధ్వర్యంలో మంచు విష్ణు ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. (Twitter/Photo)