Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో.. మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు..!
Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో.. మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు..!
Prabhas: ప్రభాస్ నిత్యం వార్తల్లో ఉంటాడు. వరుస సినిమాలతో బిజీగా మారిన డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సెలబ్రిటీలంతా వరుసగా శుభాకాంక్షలు తెలిపాడు, ఈ సందర్భంగా మంచు విష్ణు ప్రభాస్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో అందగాడు, ఆరాడుగుల బుల్లెట్. ప్రభాస్ కటౌట్ చూస్తే.. ఎవరైన ఫిదా కావాల్సిందే.
2/ 8
ప్రభాస్ అంటే పడిచచ్చే అమ్మాయిలే కాదు.. హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం 40 ఏళ్లు దాటుతోన్న పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండటం లేదు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సైతం ప్రభాస్ పెళ్లి ముచ్చట చూడకుండానే చనిపోయారు.
3/ 8
ప్రభాస్ బర్త్ డే ఇవాళ, ఈసందర్భంగా ఆయనకు పలువురు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు.. ప్రభాస్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
4/ 8
మంచు విష్ణు ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి పలు వ్యాఖ్యలు చేసారు. ఈ కామెంట్స్ ఫై ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంచు విష్ణు చేసిన కామెంట్స్ సరిగా లేవంటున్నారు.
5/ 8
'మరో తల్లికి పుట్టిన నా సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వచ్చే పుట్టినరోజు నాటికి అతడు పెళ్లిచేసుకుంటాడో లేదో నాకు తెలీదు కానీ కచ్చితంగా అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అయితే ఇస్తాడు. నా ప్రేమాభిమానాలు నీకెప్పుడూ ఉంటాయి డార్లింగ్ బ్రదర్ ప్రభాస్'' అని విష్ణు మంచు తన ట్వీట్లో పేర్కొన్నారు.
6/ 8
పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే చిలిపిగా ప్రభాస్ పెళ్లి గురించి సెటైర్ కూడా వేశారని , కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంచు విష్ణుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.
7/ 8
మరోవైపు మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాకు షాకింగ్ కలెక్షన్లు వస్తున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు దీంతో థియేటర్లలో టికెట్స్ బుకింగ్ కూడా జరగడం లేదు.
8/ 8
ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ప్రభాస్ పెళ్లి మాట ఎత్తకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు. సలార్, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ వంటి బిగ్ ప్రాజెక్టులతో బిజీగా మారాడు. వరుసగా షూటింగులు చేస్తూ.. డార్లింగ్ నిమిషం ఖాళీ లేకుండా ఉన్నాడు.