Ginna 1st Week Box Office World Wide Box Office Collections: మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’. గత కొన్నేళ్లుగా ఈయన సినిమాలు తగ్గించాడు. మా అధ్యక్షుడు అయిన తర్వాత ఈయన నటించగా విడుదలైన చిత్రం ‘జిన్నా’. ఈ చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్ (Sunny Leone), హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నటించారు. నూతన దర్శకుడు సూర్య తెరకెక్కించారు. మంచు మోహన్ బాబు ఈ సినిమాకు స్వయంగా స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. (Twitter/Photo)
ఈ సినిమాకు ఉల్టా నెగిటివ్ షేర్ రాబట్టి.. మోహన్ బాబు కెరీర్లోనే కాదు.. మొత్తం సినీ ఇండస్ట్రీలో ఇంత తక్కువ వసూళ్లు రాబట్టిన లెగసీ ఉన్న హీరోగా మోహన్ బాబు రికార్డులకు ఎక్కారు. తాజాగా అదే సీన్ మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ మూవీకి కంటిన్యూ అయినట్టు ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను చూస్తే అర్ధమవుతోంది. (Twitter/Photo)
మాములుగా ఏదైనా సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే ఆ ప్రభావం కలెక్షన్స్ పై ఉంటుంది. అదేమో కానీ మంచు విష్ణు జిన్నాకు మంచి టాకే వచ్చినా.. ప్రేక్షకులు మూకుమ్మడిగా పెదరాయుడు సినిమాలో చూపించినట్టు మంచు ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలను చూడకూడదన్నట్టు డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే. (Twitter/Photo)
ఇక మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమాతో పాటు విడుదలైన డబ్బింగ్ చిత్రాలు సర్ధార్, ప్రిన్స్, నిన్న మొన్న వచ్చిన విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ఓరి దేవుడా’ చిత్రాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అదమోకానీ.. జిన్నా.. సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 15 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇంత కంటే దారుణమైన విషయం మంచు విష్ణు కెరీర్లో ఉండడనే చెప్పాలి.పైగా ఈ సినిమా టైటిల్ అఖండ భారత్‌ను విడగొట్టిన ‘జిన్నా’ పేరును పెట్టడం. దాంతో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హిందువులు పరమ పవిత్రంగా భావించే కొండపై డిజైన్ చేయడం వంటివి ఈ సినిమాపై ఒకింత నెగిటివ్ అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకెళ్లింది. (Photo Twitter)
ఇషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన జిన్నా (Ginna) సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజుకు గాను 12 లక్షల రూపాయల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే జిన్నా ఫస్ట్ డే కలెక్షన్స్ 15 లక్షలు షేర్ వచ్చింది. మొదటి వారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 58 లక్షల షేర్ (రూ. 1.51 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.
ఒక రకంగా జిన్నా కలెక్షన్లు మంచు విష్ణుకు ఘోర అవమానమనే చెప్పాలి. ఈ చిత్రాన్ని కేవలం రూ. 4 కోట్లకే అమ్మారు. ఇంకా ఈ సినిమా రూ. 3.42 కోట్లు రాబడితే కానీ హిట్ అనిపించుకోదు పరిస్ధితులు చూస్తుంటే ఇక వచ్చేలా కూడా లేవు. మొత్తంగా మంచు విష్ణు టోటల్ కెరీర్లోనే అతి తక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా జిన్నా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
జిన్నా వసూళ్లు తక్కువ రావడానికి కారణంగా మంచు ఫ్యామిలీ బిహేవియర్ అనేది అందరు చెప్పుకుంటున్నారు. ఎపుడు ఏదో ఒక ఇష్యూలో ఈ ఫ్యామిలీ తల దూర్చడంతో పాటు వివిధ సామాజిక వర్గాలతో గొడవలు కూడా మంచు ఫ్యామిలీపై ప్రజల్లో నెగిటివ్ అభిప్రాయాలు కలిగేలా చేసాయని సోషల్ మీడియాలో అందరు చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే ప్రేక్షకులు కూడా మూకుమ్మడిగా వీళ్ల ఫ్యామిలీ సినిమాలపై అనధికార బ్యాన్ విధించారని కూడా చెప్పుకుంటున్నారు. (Twitter/Photo)
ఏమైనా మంచు ఫ్యామిలీ వాళ్లు గతం ఘనం అనే కంటే వర్తమానంలో మనం ఎలా ఉన్నామనే దానిపై మన చరిత్ర ఆధారపడి ఉంటుంది. లేకపోతే కాల గర్భంలో కలిసి పోవడం ఖాయం. ఏది ఏమైనా మంచు ఫ్యామిలీ కూడా తమలో లోపం ఎక్కడుందో చూసుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. లేకపోతే ముందు ముందు మంచు వారి కుటుంబం ఇంకా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది ప్రజల టాక్. (Ginna Photo : Twitter)