జిన్నా సినిమాకు బుకింగ్స్ పరంగానే పెద్ద దెబ్బ పడింది. తద్వారా విడుదలైన తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12 లక్షలు రాబట్టాడు జిన్నా. ఇక రెండో రోజు కూడా అదే బాటలో వెళ్లి కేవలం 10 లక్షలు వసూలు చేశాడు. సెలవు దినం అయినా బాక్సాఫీస్ వద్ద మంచు విష్ణు విలవిల్లాడటం చూసి ఇక ఈ సినిమా పనైపోయినట్లే అంటున్నారు ట్రేడ్ పండితులు.
జిన్నా సినిమాలో హీరోగా చేస్తూనే సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించారు మంచు విష్ణు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. అనూప్ రూబెన్స్ బాణీలు కట్టగా.. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.
ఈ సినిమాలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సన్నీలియోన్ (Sunny Leone) హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ సర్ప్రైజ్ చేస్తుందంటూ ప్రమోషన్స్ లో విష్ణు చెబుతూ వచ్చాడు. కానీ రిలీజ్ తర్వాత ఆ ట్రెండ్ కనిపించడం లేదు. చాలాచోట్ల సినిమా హాల్స్ జనం లేక ఖాళీగా కనిపిస్తున్నాయి.