మా ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు విజయం సాధించాడు. ప్రకాష్ రాజ్‌పై భారీ మెజారిటీతో ఈయన గెలుపొందడంతో పండగ చేసుకుంటున్నారు విష్ణు వర్గీయులు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్‌పై ముందు నుంచి కూడా నాన్ లోకల్ ముద్ర బలంగా వేయడంలో విష్ణు బాగానే సక్సెస్ అయ్యాడు. ఆయనకు క్రమశిక్షణ కూడా లేదని.. షూటింగ్స్‌కు కూడా సమయానికి రాడంటూ ఆయనపై విమర్శలు బాగానే చేసారు. వీటన్నింటికీ ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో నెక్ట్స్ ఆయనేం చేస్తాడు.. మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడతాడనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా ఈ ఎన్నికల్లో ప్యానెల్స్‌లో గెలిచిన సభ్యులను ఓ సారి చూద్దాం..