ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమా టీజర్ రీసెంట్ గా విడుదలై ఆన్ లైన్ ప్రభంజనం సృష్టిస్తుండగా.. ఈ వీడియో కార్టూన్ వీడియోలా ఉందంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తుండటం చర్చనీయాంశం అయింది. వింత ఆకారాలు, యానిమేషన్ గ్రాఫిక్స్ తప్ప ఈ వీడియోలో రామాయణ ఛాయలు కనిపించడం లేదంటూ ట్రోల్స్ నడుస్తున్నాయి.
ఒకవేళ టీజర్ విడుదలకు ముందే ఇదొక యానిమేషన్ సినిమా అని చెప్పి ఉంటే.. ఈ రకమైన ట్రోల్స్ నడిచేవి కావని మంచు విష్ణు అన్నారు. ప్రేక్షకులను మోసం చేస్తే ఇలాంటి రియాక్షన్ రావడంలో వింతలేదని ఆయన చెప్పారు. ఆదిపురుష్ టీజర్ చూస్తున్నప్పుడు తనకు రజనీకాంత్, దీపికా పదుకొనె కొచ్చాడియాన్ చిత్రం గుర్తుకొచ్చిందని చెబుతూ ట్రోలర్స్‌కి బూస్టింగ్ ఇచ్చారు మంచు విష్ణు.
ఇటీవల రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న ప్రభాస్.. తదుపరి సినిమాతో ఆ లోటు భర్తీ చేసి రెబల్ స్టార్ (Rebal Star) అభిమానులను హుషారెత్తించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆదిపురుష్ సినిమాతో ఆ వెలితిని భర్తీ చేయాలని చూస్తున్న క్రమంలో ఇలాంటి విమర్శలు ప్రభాస్ అభిమానులను నిరాశ పరుస్తున్నాయి.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ఈ భారీ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.