ఓ వైపు సినిమా హీరోగా చేస్తూనే మరోవైపు మా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు మంచు విష్ణు. సినిమాల పరంగా చూస్తే కాస్త స్పీడు తగ్గించి విలక్షణ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. హీరోగా ఇప్పటిదాకా చెప్పుకోదగిన సక్సెస్ చూడని ఈ స్టార్ కిడ్ ఇప్పుడు జిన్నా (Ginna) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఈ సినిమాలో మంచు విష్ణు మరోసారి తన కామెడీ యాంగిల్ చూపించబోతున్నారని తెలుస్తోంది. ఊరి నిండా అప్పులు చేసి.. టెంట్ హౌస్ నడుపుకునే యువకుడి పాత్రలో మంచు విష్ణు కనిపించబోతున్నారు. చిత్రంలో రఘుబాబు, చమ్మక్ చంద్ర కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం విశేషం.