సినీ పరిశ్రమలో అవకాశాల కోసం తిరిగే సమయంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని చెప్పారు మోహన్ బాబు. ఇల్లు అమ్ముకునేంత కష్టం ఎదురైనా.. ఏ ఒక్కరూ సాయం చేయలేదని చెప్పారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎంతగానో తిరిగానని, ఆ సమయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పారు. అన్ని అవమానాలను ఎదుర్కొని వచ్చిన వాడే సినీ పరిశ్రమలో నిలదొక్కుకోగలడు. అలా అన్ని తాను అనుభవించానన్నారు మోహన్ బాబు.