ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ రేంజ్ లో ఖర్చు పెడుతూ ముందుకెళుతున్నారు. తాజాగా చెర్రీ పుట్టిన రోజున ఈ సినిమాకు 'గేమ్ చేంజర్' (#GameChanger) అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు పేర్కొన్నారు మేకర్స్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న 50వ సినిమా కావడంతో దిల్ రాజు ఈ మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.