మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి ఇంట్లోనే మంచు మనోజ్ రెండో పెళ్లి జరగనుందని సమాచారం. ఈ రోజు సంగీత్ కార్యక్రమంలో అత్యంత సన్నిహితులు పాల్గొన్నారట. తాజాగా ఈ వేడుకకు సంబంధించి మెహందీ ఓహొటోతో పాటు డెకరేషన్ పిక్స్ షేర్ చేసింది మంచు లక్ష్మి. దీంతో మార్చి 3న జరగనున్న ఈ పెళ్లిపై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
చాలా కాలంగా మౌనికా రెడ్డి ప్రేమలో మంచు మనోజ్ ఉన్నారని టాక్. గతంలో మౌనిక రెడ్డి మొదటి వివాహానికి కూడా మంచు మనోజ్ హాజరయ్యారనే ప్రచారం జరిగింది. అయితే అటు మనోజ్, ఇటు మౌనిక రెడ్డి వైవాహిక జీవితాలు సాఫీ సాగకపోవడంతో డివోర్స్ తీసుకున్నారని, ఆ క్రమంలోనే ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
ఎన్నో రూమర్స్ బయటకు వస్తున్న సమయంలోనే భూమా మౌనికతో పబ్లిక్ గా కనిపించారు మనోజ్. దీంతో వీరిద్దరి సీక్రెట్ ఎఫైర్, పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. పలు సందర్భాల్లో ఈ విషయంపై మంచు లక్ష్మిని మీడియా ప్రశ్నించగా.. తిన్నగా దాటలేసింది. అయితే అంతా అనుకున్నదే నిజం చేస్తూ మార్చి 3న మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి పెళ్లి జరగబోతోంది.