మంచు మనోజ్(Manchu Manoj)మరోసారి వివాహం చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాయలసీమకు చెందిన ఓ రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని మంచు మనోజ్ రెండో వివాహం(Second marriage)చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వార్తే కాదు ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియా(Social media)లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నేపధ్యం కలిగిన భూమానాగిరెడ్డి,శోభానాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డినే మనోజ్ వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. దీనికి కారణం హైదరాబాద్‌లో గణేష్ మండపానికి మంచు మనోజ్‌తో పాటు భూమా మౌనికారెడ్డి ఇద్దరూ కలిసి పూజలు చేసిన ఫోటోలు బయటకు రావడమే ఈ వార్తకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
మరోవైపు మనోజ్ విషయానికి వస్తే.. పెళ్లైన రెండేళ్లకే మంచు మనోజ్ విడాకులు తీసుకున్నాడు. తన భార్య ప్రణతితో విడిపోయాడు ఈయన. మనస్పర్థల కారణంగా ఎక్కువ రోజులు ఈ ఇద్దరి బంధం నిలబడలేదు. పెళ్లి తర్వాత ప్రణతి అమెరికా వెళ్లడం.. అక్కడే ఉద్యోగం చేసుకోవడం చేసిందని తెలుస్తుంది. ఇక్కడే మనోజ్, ప్రణతి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో మనోజ్ వరస సినిమాలతో బిజీగా ఉండేవాడు.