మంచు మనోజ్ గత కొన్ని రోజులగా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ మనోజ్ భూమా మౌనికా రెడ్డిని మార్చి 3న ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మంచు మనోజ్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డిని పెళ్లాడారు మనోజ్. ఈ పెళ్లి వేడుక మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ నివాసంలో జరిగింది.. Photo : Twitter
హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి ఇంట్లో జరిగిన ఈ పెళ్లికి మంచు, భూమా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైయ్యారు. ఇక వివాహం అనంతరం ఈజంట తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ అక్కడి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. తమది నాలుగేళ్ల ప్రేమ అని.. తాను బాధల్లో ఉన్నప్పుడు మౌనికా రెడ్డి తనకు ఎంతో అండగా నిలిచారని.. ప్రేమను పంచారని..ఎన్నో వ్యతిరేకతల మధ్య కూడా మేం అలా ముందుకు వెళ్లాం.. అలా మా మధ్య మొదలైన అనుబంధం నాలుగేళ్లుగా కొనసాగిందని తెలిపారు. Photo : Twitter
మా నాలుగేళ్ల ప్రేమ చివరికి పెళ్లిగా మారిందని.. అందరూ కలిసి మా ప్రేమని గెలిపించి వివాహం చేసారన్నారు. తన ప్రేమ గెలిచినందనుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. త్వరలో పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేస్తానని.. పాలిటిక్స్‌పై అసలు ఇంట్రెస్ట్ లేదని.. అయితే మౌనిక రాజకీయాల్లోకి వెళితే తన సపోర్ట్ మాత్రం ఉంటుందని అన్నారు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే మనోజ్ పెళ్లి చేసుకున్న భూమా మౌనికా రెడ్డి ఆస్తుల గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆమె ఆస్తుల విలువ 1500 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. మౌనిక పేరుపై కమర్షియల్ ప్రాపర్టీస్ ఎక్కువగానే ఉన్నాయట. ముఖ్యంగా ఆళ్లగడ్డ, కర్నూలు ఏరియాల్లో ఉన్నాయని సమాచారం. Photo : Twitter
మరోవైపు మౌనిక మాత్రం రాజకీయాలపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ జంటకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మనోజ్ ప్రస్తుతం వాట్ ద ఫిష్ అనే సినిమా చేస్తున్నారు. మనోజ్ 2015లో హైదరాబాద్‌కు చెందిన ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు కాపురం తర్వాత 2019లో విడిపోయింది ఈ జంట. Photo : Twitter
ఇక్కడ మరో విషయం ఏమంటే.. మంచు వారి ఇంటికి పెద్ద కోడలు వెరోనికాతో పాటు మంచు మనోజ్ మొదటి భార్య, రెండో భార్య మౌనిక అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. మంచు మనోజ్‌తో పాటు భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండవ వివాహమే కావడం విశేషం. భూమా మౌనిక రెడ్డితో ఎప్పటినుంచో క్లోజ్ గా ఉంటున్న మనోజ్.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోబోతుండటం హాట్ టాపిక్ అయింది. Photo : Twitter
మంచు మనోజ్ రెండో పెళ్లి వేడుక ఫిల్మ్ నగర్‌లోని మంచు నిలయంలో ఘనంగా జరిగింది. భూమా మౌనికా రెడ్డిని (Bhuma Mounika Reddy) పెళ్లాడారు మంచు మనోజ్ (Manchu Manoj). ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్చి 3వ తేదీన జరిగిన ఈ పెళ్లి వేడుకతో మంచు మనోజ్- భూమా మౌనికా రెడ్డి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. Photo : Twitter
ఇద్దరూ కూడా తమ తమ జీవితంలో రెండో సారి ఏడడుగులు వేసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అటు మనోజ్, ఇటు మౌనిక ఇద్దరిదీ కూడా రెండో వివాహమే కావడం విశేషం. దివంగత దంపతులు భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి రెండో కుమార్తెనే ఈ భూమా మౌనిక రెడ్డి. మౌనికను ప్రేమించిన మంచు మనోజ్.. ఇప్పుడు ఆమె మెడలో మూడుముళ్లు వేసి భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించారు. పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంటకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Photo : Twitter