మంచు లక్ష్మి యోగాసనాలు.. బామ్మగారంటూ రంగంలోకి నెటిజన్లు.. నెట్టింట దుమ్ముదుమారం
మంచు లక్ష్మి యోగాసనాలు.. బామ్మగారంటూ రంగంలోకి నెటిజన్లు.. నెట్టింట దుమ్ముదుమారం
Manchu Lakshmi Yoga: శారీరక, మానసిక వికాసానికి దోహదపడే యోగాపై అవగాహన కల్పించడంలో భాగంగా నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు సెలబ్రిటీలు తమ తమ యోగాసనాలను పోస్ట్ చేస్తూ మానవాళికి యోగా ఉపయోగంపై సందేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా పలువురు సెలబ్రిటీలు యోగాసనాలు చేస్తూ ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి (Manchu Lakshmi) తన యోగాసనాలను నెటిజన్ల ముందు పెట్టింది.
2/ 9
శారీరక, మానసిక వికాసానికి దోహదపడే యోగాపై అవగాహన కల్పించడంలో భాగంగా నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు సెలబ్రిటీలు తమ తమ యోగాసనాలను పోస్ట్ చేస్తూ మానవాళికి యోగా ఉపయోగంపై సందేశాలు ఇస్తున్నారు.
3/ 9
ఇప్పటికే నందమూరి బాలకృష్ణ సహా చాలా మంది ప్రముఖులు యోగాసనాలు చేస్తూ ఆ ఫోటోలు పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన యోగాసనాల ఫొటోలపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
4/ 9
యోగాపై అవగాహన కల్పించేలా మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ ఫొటోస్ చూసి కొంతమంది నెటిజన్లు థ్రిల్ అవుతుండగా.. మరి కొంతమంది నెటిజన్లు ఎప్పటిలాగే మంచు లక్ష్మిపై ట్రోలింగ్ షురూ చేశారు. ఏదేమైనా ఆమె పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే నెట్టింట ఈ పిక్స్ వైరల్ అయ్యాయి.
5/ 9
సో ప్రెట్టీ, అట్లుంటది నీతోని.. సూపర్ డ్రెస్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ మంచు లక్ష్మీకి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుండగా.. ఇంకొందరు మాత్రం బామ్మగారు ఎందుకు ఇవన్నీ మనకి అంటున్నారు. అంతేకాదు ఆంటీ సూపర్ అనేవాళ్ళు కూడా ఉన్నారు.
6/ 9
మంచు మోహన్ బాబు నట వారసురాలిగా సినీ గడప తొక్కింది మంచు లక్ష్మి. అమెరికాలో చదువుకున్న ఆమె అక్కడే హాలీవుడ్ సీరియల్స్‌లో నటించి ఆ తర్వాత ఇండియాకు వచ్చి టాలీవుడ్లో తన మార్క్ చూపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది.
7/ 9
టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూనే పలు వెబ్ సిరీసుల్లో భాగమవుతోంది మంచు లక్ష్మి. నిర్మాతగా కూడా పలు సినిమాలు రూపొందిస్తూ మంచు వారింటి ఆల్ రౌండర్ అనిపించుకుంటోంది.
8/ 9
అయితే సినిమా అవకాశాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను టచ్ చేస్తుండటం మంచు లక్ష్మి హ్యాబీ. అయితే ఆమె పోస్టులు ఎక్కువగా ట్రోల్స్‌కి గురవుతుంటాయి. అయినప్పటికీ అవేవీ పెద్దగా పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్నది చెబుతూ వస్తోంది ఈ మంచు వారమ్మాయి.
9/ 9
ఇక మంచు లక్ష్మి వాయిస్‌కి ప్రత్యేకంగా కొందరు అభిమానులు కూడా ఉన్నారు. ఆమె యాక్సెంట్ ప్రేక్షక లోకాన్ని అట్రాక్ట్ చేస్తుంటుంది. ఎంతోమంది మంచు లక్ష్మి మాట తీరును ఇమిటేట్ కూడా చేస్తుంటారు.