ఇక మంచు లక్ష్మీ తర్వాత ఆ ఆఫర్ రమ్యకృష్ణ వద్దకు చేరింది.రమ్య, వచ్చిన అవకాశానికి వంద కంటే ఎక్కువే న్యాయం చేశారు. శివగామిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. మంచు లక్ష్మి ఇప్పటికే చాలా సార్లు తనకి వచ్చిన బాహుబలి ఆఫర్ గురించి చెబుతుంటుంది. తాజాగా మరోసారి మంచు లక్ష్మీ మాట్లాడుతూ బాహుబలి సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శివగామి పాత్ర చేయనందుకు చాలా గర్వపడుతున్నా అని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బాహుబలిలో శివగామి పాత్ర వచ్చినప్పుడు తాను రిజెక్ట్ చేసిన విషయం గురించి చెప్పిలంది మంచు లక్ష్మీ. మనం ఒక పాత్ర పోషించిన తర్వాత దానిలోనే ఉండిపోతాం. కానీ నేను మాత్రం ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోలేదంది. బాహుబలి సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక నిజానికి నేను చాలా గర్వపడ్డానంది మంచు లక్ష్మీ.