భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ క్లోజ్‌గా ఉండటం చూసి వీళ్ళిద్దరూ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ రిలేషన్ ఇప్పటిది కాదని, ఆ ఇద్దరూ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉండి కూడా వేరు వేరు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు చెప్పడం ఎన్నో రకాల చర్చలకు తావిచ్చింది.
అదేవిధంగా తమ ఫ్యామిలీ మీద జరుగుతున్న ట్రోలింగ్ పై కూడా రియాక్ట్ అయింది మంచు లక్ష్మి. 'మా' అంటే బుల్ షిట్.. ఒక పొలిటికల్ సిస్టమ్‌లో బురద జల్లుతూ ఉంటారని ఆమె కామెంట్ చేసింది. తమకు ఇప్పటివరకూ మోహన్ బాబు బిడ్డలుగా ఎక్కడికి వెళ్లినా ప్రేమ అందుకోవడమే తెలుసు కానీ ఈ నెగెటివిటీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదని చెబుతూనే వీటి ద్వారా తాము కూడా పాఠం నేర్చుకున్నామని మంచు లక్ష్మి చెప్పడం గమనార్హం.