Nani: దసరా చూసి మంచు లక్ష్మి రియాక్షన్.. దగ్గుబాటి రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nani: దసరా చూసి మంచు లక్ష్మి రియాక్షన్.. దగ్గుబాటి రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Manchu Lakshmi: నాని కెరీర్ లో డిఫరెంట్ మూవీగా వచ్చిన దసరా సినిమాకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా చూసి నాని నటనపై, దర్శకుడి శ్రీకాంత్ ఓదెల టాలెంట్ పై పలువురు సినీ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నాయి.
నాచురల్ స్టార్ నాని కెరీర్ లో డిఫరెంట్ మూవీగా వచ్చిన దసరా సినిమాకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా చూసి నాని నటనపై, దర్శకుడి శ్రీకాంత్ ఓదెల టాలెంట్ పై పలువురు సినీ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నాయి.
2/ 8
ఇప్పటికే ఈ దసరా అద్భుతం అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు కొనియాడగా.. తాజాగా దసరా సినిమా పోస్టర్స్ షేర్ చేస్తూ దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారు. దసరా చూసి వారి వారి ఫీలింగ్స్ బయటపెట్టారు.
3/ 8
దసరా సినిమా చాలా చాలా బాగుందని, చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు అంటూ మంచు లక్ష్మి రియాక్ట్ కాగా.. రానా స్పందిస్తూ నాని నటనను, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అంటూ రానా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
4/ 8
మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన పాన్ ఇండియా మూవీ దసరా.. ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటోంది. క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా కూడా ఈ కథకు ఫిదా అయిపోతున్నారు. దీంతో దేశవిదేశాల్లో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతూ వసూళ్ల ప్రవాహం పారిస్తోంది దసరా.
5/ 8
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ వసూళ్లు రాబడుతున్న దసరా సినిమా అటు యూఎస్ లో కూడా హవా నడిపిస్తోంది. రూరల్ మాస్ ఎంటర్టైనర్ గా అక్కడి ఆడియన్స్ ని హుషారెత్తిస్తోంది. దీంతో నాని ఖాతాలో మరో అరుదైన రికార్డ్ నమోదైంది.
6/ 8
బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ప్రయోగాత్మక పాత్ర కనిపంచారు నాని. విడుదలకు ముందు వచ్చిన దసరా ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. ఈ సినిమాలో మాస్ యాక్షన్ రోల్ లో నాని కనిపించారు.
7/ 8
గతేడాది ‘అంటే సుందరానికీ’ సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న ఆయన.. ఈ సారి పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగారు. తెలంగాణ లోని గోదావరిఖని సమీపంలో ఉన్న సింగరేణి ప్రాంతానికి చెందిన ఫిక్షనల్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
8/ 8
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కట్టు బొట్టు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. మహానటి సినిమా తర్వాత మరోసారి అవార్డ్ లెవెల్ నటన కనబర్చిందని అంటున్నారు ఆడియన్స్.