టాలీవుడ్ నటీమణుల్లో మంచు లక్ష్మి రూటే సపరేటు. ఆమె సినీ జర్నీ, చెప్పే మాటలు అన్నీ కూడా ఎంతో డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. నిత్యం ట్రోల్స్ బారిన పడినా కూడా తన దారిలో తాను వెళుతుండటం ఆమె నైజం. అలాంటి మంచు లక్ష్మి.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఫోటో ఒకటి రీసెంట్ గా బయటకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చేత కత్తి పట్టి ఆయన ఇచ్చిన పోజ్ నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. అయితే సరిగ్గా ఇలాంటి పోజ్ లోనే గతంలో మంచు లక్ష్మి దిగిన ఓ పిక్‌ని పవన్ కళ్యాణ్ పోజుతో పోల్చుతూ ఓ నెటిజన్ దుమారం రేపే కామెంట్స్ చేశాడు.
అయితే పవన్ కళ్యాణ్‌ని, తనను ఇలా పక్కపక్కన పెట్టి పోల్చిన ఆ పోస్ట్ మంచు లక్ష్మి కంటపడటంతో వెంటనే తన మనసులోని మాట చెప్పేసింది. మంచో, చెడో.. పవన్ పక్కన తన ఫొటో పెట్టడం పట్ల థ్రిల్ గా ఫీలయినట్లు తెలుపుతూ ట్వీట్ పెట్టింది మంచు లక్ష్మి. అయితే ఈ ట్వీట్ చూసి కూడా నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తుండటం కొసమెరుపు.