Manchu Lakshmi కంటతడి.. రెండేళ్ల పాటు కలిసున్నామంటూ ఆ కారణం చెప్పడంతో అంతా షాక్
Manchu Lakshmi కంటతడి.. రెండేళ్ల పాటు కలిసున్నామంటూ ఆ కారణం చెప్పడంతో అంతా షాక్
Lakshmi Manchu Video: మంచు ఫ్యామిలీ నుంచి నటిగా, నిర్మాతగా టాలీవుడ్ ఇంస్ట్రీలో నిలదొక్కుకుంటోంది మంచు లక్ష్మి. యాంకర్‌గా కూడా చేసిన ఆమె వెబ్ సిరీస్ లతో పాటు మోడ్రన్ ట్రెండ్ క్యాచ్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మంచు మోహన్ బాబు నట వారసురాలు, టాలీవుడ్ నటి మంచు లక్ష్మి తరచుగా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. సినిమాల పరంగా చెప్పుకోదగ్గ సక్సెస్ రాబట్టనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హవా నడిపిస్తుంది ఈ మంచు వారమ్మాయి.
2/ 9
మంచు ఫ్యామిలీ నుంచి నటిగా, నిర్మాతగా టాలీవుడ్ ఇంస్ట్రీలో నిలదొక్కుకుంటోంది మంచు లక్ష్మి. యాంకర్‌గా కూడా చేసిన ఆమె వెబ్ సిరీస్ లతో పాటు మోడ్రన్ ట్రెండ్ క్యాచ్ చేసే ప్రయత్నాలు చేస్తోంది.
3/ 9
ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే తన వంతుగా సామాజిక సేవలోనూ భాగం అవుతుండటం ఈ మంచు వారమ్మాయి నైజం. కాకపోతే అప్పుడప్పుడూ ఆమె పెట్టే పోస్టులు నెట్టింట రచ్చకు దారి తీస్తుంటాయి. ఇలా ఆమె ట్రోల్స్ బారిన పడిన సందర్భాలు బోలెడు.
4/ 9
అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో మంచు లక్ష్మి కంటతడి పెట్టుకోవడం, అందుకు రీజన్ తన కూతురు అని చెప్పడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
5/ 9
దాదాపు రెండేళ్ల తర్వాత తన కుమార్తె విద్యా నిర్వాణను స్కూల్‌కి పంపిందట మంచు లక్ష్మి. అయితే కరోనా కారణంగా ఇన్ని రోజుల పాటు తనతోనే ఉన్న కూతురు ఇప్పుడు స్కూల్‌కి వెళుతుండటం మంచు లక్ష్మి ఆవేదనకు కారణమైంది. ఈ రెండేళ్లలో తన కూతురుతో ఏర్పడిన బాండింగ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది మంచు లక్ష్మి.
6/ 9
లాక్ డౌన్ (Lock down) రావడంతో ఇంట్లోనే ఉన్న విద్యాను 24 గంటలు ఎలా భరించాలా? అని అనుకున్నా. అయితే ఈ రెండేళ్ల కాలంలో మా మధ్య ప్రేమ, ఎఫెక్షన్ మరింత బలపడింది. అందుకే ఇప్పుడు తనను స్కూల్‌కి పంపి వస్తుంటే ఏదో తెలియని బాధగా ఉందని చెబుతూ తీవ్ర భావోద్వేగం చెందింది మంచు లక్ష్మి.
7/ 9
విద్యకు దూరంగా ఉండటం ఇంత కష్టంగా ఉంటుందా? అనిపిస్తోందని.. త్వరలోనే దీనికి అలవాటు పడతానని భావిస్తున్నా అంటూ ఈ వీడియోలో మంచు లక్ష్మి పేర్కొంది. అయితే ఇది చూసి కొందరు షాకవుతున్నారు. పిల్లల్ని స్కూల్‌కి పంపించడానికి ఇంత బాధ పడాలా అని కామెంట్స్ చేస్తున్నారు.
8/ 9
ఇకపోతే రీసెంట్ గానే తన కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసింది మంచు లక్ష్మి. తన కొత్త సినిమాకు 'అగ్నినక్షత్రం' అనే టైటిల్ ఫిక్స్ చేశామని తెలిపింది. ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది ఈ మంచువారమ్మాయి.
9/ 9
ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ అగ్నినక్షత్రం సినిమాకు లిజో కే జోషి సంగీతం అందిస్తున్నాడు. మోహన్ బాబు, మంచు లక్ష్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డిఫరెంట్ పాయింట్ టచ్ చేశారని, ఇది మంచు ఫ్యామిలీకి మెమరబుల్ సినిమా అవుతుందని అంటున్నారు.