Manchu Lakshmi: ఈ రోజు నా కల నిజమైంది.. ఆయనతో కలిసి! మంచు లక్ష్మి ఎమోషనల్ కామెంట్స్
Manchu Lakshmi: ఈ రోజు నా కల నిజమైంది.. ఆయనతో కలిసి! మంచు లక్ష్మి ఎమోషనల్ కామెంట్స్
Agni Nakshatram: టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూనే పలు వెబ్ సిరీసుల్లో భాగమవుతోంది మంచు లక్ష్మి. నిర్మాతగా కూడా పలు సినిమాలు రూపొందిస్తూ మంచు వారింటి ఆల్ రౌండర్ అనిపించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది మంచు లక్ష్మి.
మంచు మోహన్ బాబు నట వారసురాలిగా సినీ గడప తొక్కింది మంచు లక్ష్మి. అమెరికాలో చదువుకున్న ఆమె అక్కడే హాలీవుడ్ సీరియల్స్‌లో నటించి ఆ తర్వాత ఇండియాకు వచ్చి టాలీవుడ్లో తన మార్క్ చూపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది.
2/ 9
టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూనే పలు వెబ్ సిరీసుల్లో భాగమవుతోంది మంచు లక్ష్మి. నిర్మాతగా కూడా పలు సినిమాలు రూపొందిస్తూ మంచు వారింటి ఆల్ రౌండర్ అనిపించుకుంటోంది.
3/ 9
ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసింది మంచు లక్ష్మి. తన కొత్త సినిమాకు 'అగ్నినక్షత్రం' అనే టైటిల్ ఫిక్స్ చేశామని తెలిపింది. ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది ఈ మంచువారమ్మాయి.
4/ 9
అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ అగ్నినక్షత్రం సినిమాలో మంచు లక్ష్మితో పాటు ఆమె తండ్రి మోహన్ బాబు కూడా నటిస్తున్నారు. ఇలా తన తండ్రితో తెరపంచుకోవడం పట్ల మంచు లక్ష్మి ఆనందం వ్యక్తం చేస్తోంది.
5/ 9
ఈ మేరకు తాజాగా ఈ రోజు నా కల నిజమైంది అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది మంచు లక్ష్మి. అగ్నినక్షత్రం టైటిల్ టీజర్ వీడియోను వదిలిన ఆమె.. మా నాన్నతో కలిసి తెలుగు సినిమాలో నటిస్తున్నా. ఆయనతో కలిసి నిర్మించే అవకాశం కూడా దక్కిందని పేర్కొంది.
6/ 9
ఈ సినిమాలో భాగం కావడం చాలా ఉద్వేగభరితంగా ఉందని తెలిపిన మంచు లక్ష్మి.. తమ సినిమా టైటిల్‌ను అధికారికంగా వెల్లడించడానికి చాలా సంతోషిస్తున్నానని.. ప్రేక్షకులందరి ఆశీర్వాదం తనకు కావాలని అభ్యర్థించింది మంచు లక్ష్మి.
7/ 9
ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ అగ్నినక్షత్రం సినిమాకు లిజో కే జోషి సంగీతం అందిస్తున్నాడు. మోహన్ బాబు, మంచు లక్ష్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డిఫరెంట్ పాయింట్ టచ్ చేశారని, ఇది మంచు ఫ్యామిలీకి మెమరబుల్ సినిమా అవుతుందని అంటున్నారు.
8/ 9
ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను టచ్ చేస్తుండటం మంచు లక్ష్మి హ్యాబీ. అయితే ఆమె పోస్టులు ఎక్కువగా ట్రోల్స్‌కి గురవుతుంటాయి. అయినప్పటికీ అవేవీ పెద్దగా పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్నది చెబుతూ వస్తోంది ఈ మంచు వారమ్మాయి.
9/ 9
మంచు లక్ష్మి వాయిస్‌కి ప్రత్యేకంగా కొందరు అభిమానులు కూడా ఉన్నారు. ఆమె యాక్సెంట్ ప్రేక్షక లోకాన్ని అట్రాక్ట్ చేస్తుంటుంది. ఎంతోమంది మంచు లక్ష్మి మాట తీరును ఇమిటేట్ కూడా చేస్తుంటారు. అలా మంచు లక్ష్మి నిత్యం ఏదో ఒక కోణంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.