తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు ఒకటికి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అందులో ఇద్దరు భార్యలతో కూడా వాళ్లకు పిల్లలున్నారు. అలాంటప్పుడు తండ్రి ఒక్కడే అయినా తల్లి మాత్రం వేరుగా ఉన్నారు. సాధారణంగా సినిమాలలో ఇలాంటి కాంబినేషన్స్ చూస్తుంటాం. రియల్ లైఫ్‌లో కూడా అలాంటి వాళ్లున్నారు. మహేష్ బాబు, నరేష్.. నాగ చైతన్య, అఖిల్ అక్కినేని, మంచు సోదరులు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా చాలా మంది హీరోలకు తండ్రి ఒక్కడే కానీ తల్లి మాత్రం వేరు. మరి అలాంటి స్టార్స్ ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి.
మహేష్ బాబు- నరేష్: దివంగత సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య దివంగత ఇందిరా కొడుకు మహేష్ బాబు అయితే.. రెండో భార్య దివంగత విజయనిర్మల కుమారుడు నరేష్. కానీ విజయ నిర్మలకు సూపర్ స్టార్ కృష్ణ గారు రెండో భర్త. విజయ నిర్మల మొదటి భర్త సంతానం నరేష్. మహేష్ బాబు, నరేష్‌కు తల్లులతో పాటు తండ్రులు కూడా వేరు. వీళ్లిద్దరు వరుసకు సోదరులు అవుతారు. (Twitter/Photo)