MALLUWOOD TO BOLLYWOOD ACTRESS WHO HAVE ROOTS IN KERALA BUT MADE IT BIG IN OTHER ENTERTAINMENT MALLU ACTORS WHO WENT TO MUMBAI TA
Malluwood Actors: మల్లూవుడ్ టు ముంబయి.. తిరువనంతపురం టు ముంబయి వెళ్లిన తారలు..
Mallu Actors Who Went To Bollywood: కేరళను Gods Own Country అని పిలుస్తారు. అంటే దేవుడికి ఎంతో ఇష్టమైన దేశమని అర్థం. మరి దేవుడు ఇష్టపడే దేశమంటే దేవకన్యలు ఉండొద్దా..? దానికేం లోటు. అక్కడ వేలాది మంది అందగత్తెలు పుట్టారు. వారిలో సినీ జగత్తునూ ఏలిన వారూ ఉన్నారు. మళయాళంలో పుట్టి పెరిగో.. లేక మళయాళంతో సంబంధం ఉన్న వాళ్లు చాలా మందే బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వాళ్లెవరో ఇక్కడ చూద్దాం.
దేవుడికి ఇష్టమైన ప్రదేశమైన కేరళలో దేవకన్యలు చాలా మందే ఉన్నారు. ఎంతో మంది నటీమణులు Malluwood నుంచి ఇతర భాషల్లోకి వెళ్లి సక్సెస్ అందుకున్నారు. వారిలో కొంత మందిని ఇక్కడ చూద్దాం.
2/ 13
బాలీవుడ్ స్టన్నంగ్ బ్యూటీ గా పేరున్న విద్యాబాలన్ మళయాళీనే. మల్లువుడ్ లో ఆమె సినిమా అవకాశాల కోసం తిరిగింది. కానీ మళయాళీ సినిమా ఆమెను ఆదరించలేదు. అది తమ దురదృష్టం అంటారు అక్కడి విద్యా బాలన్ అభిమానులు.
3/ 13
మళయాళి బ్యూటీ అసిన్.. ఆమె పుట్టి పెరిగిందంతా కేరళలోనే. తెరంగ్రేటం చేసింది కూడా మళయాళి సినిమా ద్వారానే. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో ఒక ఊపు ఊపిన అసిన్.. గజిని సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్, అజయ్ లతో ఆడిపాడింది.
4/ 13
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా దూపియా పుట్టి పెరిగింది కేరళలోని కొచ్చి లో అన్నది చాలా మందికి తెలియదు. ఇక్కడి నుంచి వెళ్లిన ఆమె ముంబయిలో గ్లామర్ రంగంలోకి ప్రవేశించింది. (Twitter/Photo)
5/ 13
లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార.. పుట్టి పెరిగిందంతా కేరళలోనే.. ఆ తర్వాత ఈ అమ్మడు తమిళ, తెలుగు సినిమాలలో బిజీ హీరోయిన్ గా మారింది. త్వరలో బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకోనుంది.
6/ 13
ఫ్యాషన్ ఐకాన్ గా పేరు పొందిన మాళవికా మోహనన్ కూడా మళయాళీ ముద్దుగుమ్మే. ఈమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కుమార్తె. తమిళ్, మళయాళి సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ ఆఫర్లు దక్కించుకుంటున్నది. తన ఫోటో షూట్ లతో కుర్రకారు మతి పోగొట్టే మాళవిక సోషల్ మీడియాలో ఒక సంచలనం.
7/ 13
నిత్యా మీనన్.. ఈ మళయాళి ముద్దు గుమ్మ ఎక్కడికెళ్లినా తన నటనతో వావ్ అనిపించుకుంటున్నది. మళయాళీ అయినా.. ఆమె అక్కడికంటే ఇతర భాషల్లోనే ఫేమస్ అయింది. తెలుగు, తమిళ్, కన్నడలతో పాటు హిందీలో ‘మిషన్ మంగళ్’ అనే సినిమాతో ‘ బ్రీత్ ఇన్ టూ షాడోస్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. (Twitter/Photo)
8/ 13
కండల వీరుడు జాన్ అబ్రహం తండ్రి మళయాళి. అబ్రహం కు కేరళ అంటే చాలా ఇష్టం. ఆయన ఇక్కడ ఒక్క సినిమాలో నటించకపోయినా.. కేరళను విపరీతంగా ప్రేమిస్తారు.
9/ 13
మహానటి కీర్తి సురేశ్.. మళయాళి మనోరమే. బాలనటిగానే అక్కడ పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాలతో యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైంది. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి ఆమెను ఎవరెస్టు మీద కూర్చోబెట్టింది.
10/ 13
డాన్సింగ్ సంచలనం మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కానీ ఆమె మూలాలూ కేరళలోనే ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె తండ్రి పంజాబీ అయినా.. తల్లి మాత్రం మళయాళి.. ఇప్పటికీ వేసవి సెలవుల్లో మలైకా కేరళకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.
11/ 13
కన్ను గీటి దేశాన్ని తన వైపునకు తిప్పుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ది కూడా కేరళనే. మళయాళం సినిమాతో పరిచయమైన ఈ కలల సుందరి.. బాలీవుడ్ లో శ్రీదేవి ఆత్మకథతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నది.
12/ 13
పూర్ణ కూడా కేరళ కుట్టినే. ఈమె తెలుగు ప్రేక్షకులకు పూర్ణగా పరిచయమైన ఈమె మలయాళంలో మాత్రం షమ్నా ఖాసిం అనే ఒరిజినల్ నేమ్‌తో ఫేమస్ అయింది. (Twitter/Photo)
13/ 13
తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అమలా పాల్ కూడా మలయాళీ ముద్దుగుమ్మనే. ఈమె త్వరలో బాలీవుడ్లో లక్ పరీక్షించుకోనుంది.