Actor Bala: ఐసీయూలో ప్రముఖ సినీ నటుడు నటుడు బాలా...
Actor Bala: ఐసీయూలో ప్రముఖ సినీ నటుడు నటుడు బాలా...
Actor Bala: ప్రముఖ మలయాళ నటుడు బాలా ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బాలా మలయాళంతో పాటు తమిళం, తెలుగు చిత్రాల్లోనూ నటించారు.
ప్రముఖ మలయాళ నటుడు బాలా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కొంత కాలంగా ఆయన కాలేయ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు.
2/ 6
బాలాను పరీక్షించిన వైద్యులు.. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. త్వరలోనే బాలకు కాలేయ మార్పిడి చేయాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది.
3/ 6
బాలా భార్య డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్తో పాటు ఆయన సోదరుడు, తమిళ సినీ నిర్మాత శివ కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. మంగళవారం ఉదయం బాలా మాజీ భార్య అమృతా సురేష్, వారి కూతురు అవంతిక కూడా ఆస్పత్రికి వచ్చి.. ఆయన్ను పరామర్శించారు.
4/ 6
మలయాళ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా అమృత ఆస్పత్రికి వెళ్లి.. బాలాను పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నటుడు ఉన్నిముకుందన్ తెలిపారు.
5/ 6
బాలా మలయాళంలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. మలయాళంతో పాటు పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. ఆయన సినీ రంగ ప్రవేశం టాలీవుడ్ ద్వారానే జరిగింది. 2002లో వచ్చిన 2మచ్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బాల.
6/ 6
2002 నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాల్లో నటించారు బాలా. అందులో మలయాళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు. తెలుగులో 2మచ్, చాప్టర్6 సినిమాల్లో ఆయన కనిపించారు. తమిళంలో పది సినిమాల్లో నటించారు.