Malavika Mohanan : మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే మాళవిక తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. మాళవిక తాజాగా ట్విట్టర్లో తన ఫాలోవర్స్‌తో ముచ్చటించారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా.. మీరు తమిళ్ సూపర్ స్టార్స్ అయిన విజయ్, రజనీకాంత్‌తో పనిచేశారు.. ఇప్పుడు ఎవరితో నటించాలనీ కోరికగా ఉంది.. అంటూ ఓ ఫాలోవర్ వేసిన ప్రశ్న వేశారు. దీనికి సమాధానంగా మాళవిక విజయ్ దేవరకొండతో నటించాలనీ ఉందని తెలిపారు. Photo : Twitter
'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు మాళవిక. ఆ తర్వాత మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించారు. మాళవిక మోహనన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య మాళవిక హిందీ హీరో విక్కీ కౌశల్‌తో ప్రేమలో ఉన్నట్లు టాక్ వచ్చింది. Photo : Instagram
మలయాళ భామ మాళవిక మోహన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులని తెగ అలరిస్తూ ఉంటుంది. మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె అయిన మాళవిక ముంబైలో జన్మించారు. ఆమె కుటుంబం కేరళకు చెందినదే అయినా ఆమె ముంబైలో సెటిల్ అయిన తన తల్లిదండ్రులకు జన్మించింది. Photo : Instagram
మమ్ముట్టి చేస్తున్న ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ కోసం ఆమె కూడా తండ్రి తో పాటు పని చేసింది. ఆ యాడ్ లో తండ్రికి సాయం చేస్తున్న అమ్మాయి బాగుండడంతో ఆమెకు నటన మీద ఆసక్తి ఉందనే విషయం తెలుసుకున్న మమ్ముట్టి తన కుమారుడు సల్మాన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చారు Photo : Instagram . Photo : Instagram