అడివి శేష్.. తెలుగులో డిఫరెంట్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక మూసకు పరిమితం కాకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఐడెండిటీ ఏర్పరుచుకున్నారు. తాజాగా ఈయన ‘మేజర్’ సినిమాలో 28/11 దాడుల్లో అసువులు బాసిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులైన ఉన్నికృష్ణన్, ధనలక్ష్మి దంపతులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా మర్యాద పూర్వకంగా కలవడంతో వారి ఆశీర్వాదం తీసుకున్నారు అడివి శేష్. (Twitter/Photo)
అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’ సినిమా విషయానికొస్తే.. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 11న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. కానీ అనూహ్యంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఈ సినిమా విడుదలను మరోసారి వాయిదా వేసారు. (Twitter/Photo)
మేజర్`(Major) సినిమా విషయానికి వస్తే.. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మేజర్ సినిమాను `గూఢచారి` ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కించారు.సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక సందీప్ ఉన్నికృష్ణన్.. వారి తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడు. ఇక వాళ్ల నాన్న ఉన్నికృష్ణన్ ఇస్రోలో సైంటిస్టుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. (Twitter/Photo)
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫ్యామిలీది కేరళలోని కోజిగడ్. కానీ వీళ్ల ఫ్యామిలీ బెంగళూరులో స్థిర పడ్డారు. ఇక మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ .. నేహాను వివాహా మాడారు. 1995లో పూనేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆర్మీలో జాయిన్ అయ్యారు. అంతేకాదు 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొని భారత్ విజయంలో కూడా కీలక భూమిక పోషించారు. ఇక 26/11 దాడుల్లో తీవ్రవాదులతో పోరాడుతూ అసువులు బాసారు. ఈ పోరాటంలో సందీప్ చూపించిన తెగువకు కేంద్రం ఆయన్ని అశోక చక్ర అవార్డుతో సత్కరించింది. అంతేకాదు ఆయన జ్ఞాపకార్ధం బెంగళూరులో యెలహంకలో ఆయన ఉంటున్న రోడ్‌కు మేజర్ ఉన్నికృష్ణన్ రోడ్‌గా నామకరణం చేసారు. (Twitter/Photo)
‘మేజర్’ మూవీని తెలుగుతో పాటు హిందీ,మలయాళం వంటి మూడు భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు.ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు. (File/Photo)
ఈ దాడుల్లో మేజర్ ఉన్నికృష్ణన్‌తో పాటు హవాల్దార్ గజేంద్ర సింగ్, అశోక్ కామ్టే, హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కకర్, తుకారామ్ ఓబ్లే ముష్కరులతో పోరాడుతూ.. అమరులయ్యారు. మేజర్ మూవీన దేశ వ్యాప్తంగా 75 లొకేషన్స్‌లలో ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు. అంతేకాదు ‘మేజర్’ మూవీని తెలుగు, హిందీతో పాటు మలయాళంలో మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్లో నటిస్తున్నారు.(Twitter/Photo)
మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. కాగా ఈ సీక్వెల్లో విశ్వక్ సేన్ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. మరోవైపు అడివి శేష్.. ‘గూఢచారి’ సినిమా సీక్వెల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. (Instagram/Photo)