అడివి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. శేష్ హీరోగా, రచయితగా వరుసగా హిట్ సినిమాలను అందిస్తున్నారు. రొటీన్ సినిమాలు కాకుండా ప్రత్యేకంగా కథలను ఎంచుకుంటున్నారు అడివి శేష్. హిట్ 2 విజయం తర్వాత అడివి శేష్ నటిస్తు్న్న మరో సినిమా గూడచారి 2. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ఓ అప్ డేట్‌ను విడుదల చేసింది టీమ్.
గూడాఛారి 2 కోసం అడివి శేష్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అడవి శేష్ నటిస్తోన్న ఈ సినిమా గూఢచారి సీక్వెల్ . అయితే మొదటి పార్ట్ లో నటించిన సమయంలో తీసుకున్న పారితోషికం తో పోల్చితే రెండవ పార్ట్ లో నటించబోతున్నందుకు అడవి శేష్ తీసుకోబోతున్న పారితోషకం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ అంటూ సమాచారం అందుతుంది. Adivi sesh Twitter
2022 సంవత్సరం లో అడవి శేష్ రెండు భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో ఆయన ఏకంగా తన పారితో షికాన్ని 8 నుండి 10 కోట్ల రూపాయలకు పెంచేశాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. వరుస సినిమాలు హిట్ అవుతుంటే.. ఇటీవల కాలంలో హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తున్నారు. ఇక అడివి శేష్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు.
దీంతో గూఢచారి సినిమా కూడా తెలుగు తో పాటు నార్త్‌లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే అడివి శేష్‌కు భారీ పారితోషికాన్ని ఇచ్చేందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఓకే చెప్పినట్లు సమాచారం అందుతుంది. ఇక నుండి అడవి శేష్ తో ఏ సినిమా తీయాలన్నా కూడా 10 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది.