Major Chandrakanth - NTR - Mohan Babu - Raghavendra Rao | ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘మేజర్ చంద్రకాంత్’ ఒకటి. ఈ సినిమాను శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో మోహన్ బాబు నిర్మించారు. అంతేకాదు ఆయన ఈ సినిమాలో సెకండ్ హీరోగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా క్రాస్ చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శారద నటిస్తే.. మోహన్ బాబు సరసన నగ్మా, రమ్యకృష్ణ నటించారు. ఈ చిత్రానికి అందించిన కీరవాణి అందించిన సంగీతం సూపర్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
మేజర్ చంద్రకాంత్‌లో ఎన్టీఆర్ సరసన శారద నటించారు. మోహన్ బాబు సరసన నగ్మా, రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాను ఎన్టీఆర్ తన భార్య బసవ తారకం మెడికల్ ట్రస్ట్ బిల్డింగ్ కోసం బయటి సినిమా చేయాలనుకుంటూ మీడియాకు వెల్లడించారు. దీంతో మోహన్ బాబు మీతో నేనే సినిమా చేస్తానంటూ అన్నగారి డేట్స్ తీసుకున్నారు. అలా మేజర్ చంద్రకాంత్ సినిమాకు అంకుర్పాణ జరిగింది. (Twitter/Photo)
‘మేజర్ చంద్రకాంత్’ హీరోగా ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్. 1993లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ చిత్రంలోని ‘పుణ్యభూమి నా దేశం’ పాటలో ఎన్టీఆర్ ఛత్రపతి శివాజీ, వీరపాండ్య కట్టబ్రహ్మన, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి దేశ భక్తుల పాత్రల్లో కనిపించి అభిమానులను ఆనందింప చేశారు. (Twitter/Photo)
‘మేజర్ చంద్రకాంత్’ హీరోగా ఎన్టీఆర్ నటించి చివరి చిత్రం. అంతకు ముందే అన్న ఎన్టీఆర్ బాపు దర్శకత్వంలో ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ సినిమాలో యాక్ట్ చేసారు. ఈ సినిమా ‘మేజర్ చంద్రకాంత్ ’తర్వాత విడులైంది. హీరోగా నటించిన చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ అయితే.. థియేటర్స్‌లో విడుదలైన లాస్ట్ చిత్రం మాత్రం ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’. (Twitter/Photo)
‘మేజర్ చంద్రకాంత్’ మోహన్ బాబు నిర్మాతగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కిన 12వ చిత్రం. ఇక రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్లో కూడా 12వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా వంద రోజుల వేడుక తిరుపతిలో జరిగింది. అప్పట్లో అదో హిస్టరీ. ఈ సినిమా వంద రోజుల వేడుకలోనే అన్నగారు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.