సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’లో అనుకోకుండా వైయస్ జగన్ ఊత పదంలా మారిన నేను విన్నాను.. నేను ఉన్నాను డైలాగ్ ను వైసీసీ శ్రేణులు తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ మహేష్ బాబు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్‌గా ఈ డైలాగ్ చెప్పారా.. లేకపోతే.. భజనా చేసారా అనేది సోసల్్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. (File/Photo)
ఐతే.. మహేష్ బాబు విషయానికొస్తే.. ఈయన బావ గల్లా జయదేవ్.. తెలుగు దేశం ఎంపీ అయినా.. ఆయనకు ఓటేయమని కూడా చెప్పారు. ప్రత్యేకంగా తెలగు దేశం పార్టీని గెలిపించమని ఎపుడు చెప్పలేదు. ఎవరు అధికారంలో ఉన్న వాళ్లతో సఖ్యతతో మెలగడం మహేష్ బాబు ప్రత్యేకత. అలాంటి మహేష్ బాబు.. వైయస్ జగన్‌తో తెలిసి తెలిసి సున్నం పెట్టుకుంటాడని ఎవరు అనుకోరు. (File/Photo)
పైగా మహేష్ బాబు మొన్న చిరంజీవి, ప్రభాస్‌లతో కలిసి ఏపీలో టికెట్ రేట్స్ పెంపు విషయంలో మర్యాద పూర్వక భేటి అయిన సంగతి తెలిసిందే కదా. పైగా ఈ నెల 12న ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఏపీ జగన్‌ను భజన చేసే విధంగానే ఈ డైలాగ్ పెట్టినట్టు తెలుస్తోంది. పైగా ఈ సినిమాకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ పెంచుకునే విషయంలో ఏపీ సీఎం వెసులుబాటు ఇచ్చే అవకాశాలున్నాయి. ఒక వేళ టికెట్ రేట్ పెంపుకు ఓకే చెబితే.. పైగా సినిమాకు టాక్ బాగుంటే వసూళ్లు ఓ రేంజ్లో ఉండే అవకాశాలున్నాయి. (File/Photo)
ముఖ్యంగా మ్యారేజ్ చేసుకునే వయసొచ్చిందటావా.. ఊరుకోండి సార్.. మీకు పెళ్లేంటి... చిన్న పిల్లాడివైతేను. అందరు నీలాగే అనుకుంటున్నారు. ఇక్కడ దూల తీరిపోతుందని తన ఫిట్నెస్ కోసం ఎంత కష్టపడుతున్నాడనే విషయాన్ని మరోసారి చెప్పాడు. ఓ వంద వయాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తోన్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు అనే డైలాగు పేలింది. (Twitter/Photo)
మొత్తంగా మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’కు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ అండదండలు ఎక్కువగా లభించే అవకాశాలున్నాయి. పైగా 5వ షోకు పర్మిషన్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ చూస్తుంటే.. పోకిరి + దూకుడు అనే రేంజ్లో ఉంది. సినిమా కూడా అదే రేంజ్లో ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులపడం ఖాయం. మొత్తంగా వైయస్ జగన్ డైలాగులు సర్కారు వారి పాట’ సినిమాకు ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి. (Twitter/Photo)