Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. Photo : Twitter
దీంతో టీమ్ తాజాగా సక్సెస్ సంబరాలను చేసుకుంది. దీనికి సంబంధించిన పిక్స్‌ను మహేష్ సతీమణి నమ్రత తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సక్సెస్ పార్టీలో దర్శకుడు పరశురామ్‌తో పాటు మహేష్, నమ్రత, నిర్మాతలు నవీన్, రవి, దిల్ రాజు, దర్శకులు హరీష్ శంకర్, బుచ్చిబాబు, మెహెర్ రమేష్ తదితరులు పాల్గోన్నారు. Photo : Twitter
ఇక ‘సర్కారు వారి పాట’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలిసొచ్చింది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1.5 మిలియన్ గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో మహేష్ కెరీర్లో అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ వసూళ్లు అందుకున్న పదకొండో సినిమాగా సర్కారు వారి పాట నిలిచింది. అయితే ఈ రికార్డ్ ఓల్లీ మహేష్ సొంతం. సౌత్ నుంచి ఆ రికార్డ్ ఒక్క మహేష్ బాబే మాత్రమే క్రియేట్ చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈసినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 45.21 కోట్లు (రూ. 70 కోట్లు గ్రాస్)ను కలెక్ట్ చేసింది. రెండో రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 11. 4 కోట్ల షేర్‌ను సొంతం చేసుకుంది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఎవరో అనే విషయంలో తాజాగా క్లారిటీ వచ్చింది. సర్కారు వారి పాట ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకు అంటే జూన్ సెకండ్ వీక్‌లో స్ట్రీమింగ్ రానుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Photo : Twitter
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చివరగా విడుదలైన మాస్ సాంగ్, మ..మ.. మహేశాకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ స్టెప్స్‌తో తెగ వైరల్ అవుతోంది. కలర్ ఫుల్ కాస్టూమ్స్‌తో అదరగొట్టే స్టెప్స్‌తో వావ్ అనిపించారు మహేష్ బాబు, కీర్తి సురేష్. సర్కారు వారి పాట రన్ టైమ్ 160 నిమిషాలు అంటే దాదాపుగా 2 గంటల 40 నిమిషాలుగా ఉండనుంది. అంతేకాదు ఈ సినిమాకు సెన్సార్ U/A సర్టిఫికేట్ వచ్చింది.. Photo : Twitter