Sitara:సితార లిమిట్స్లోనే ఉంది.. మహేష్ బాబు వైఫ్ నమ్రత సీరియస్ కామెంట్స్
Sitara:సితార లిమిట్స్లోనే ఉంది.. మహేష్ బాబు వైఫ్ నమ్రత సీరియస్ కామెంట్స్
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. సితారపై తల్లి నమ్రత మాట్లాడుతూ.. "సరైన సమయంలో సరైన పనులు చేసేలా ఆమెకు మార్గనిర్దేశం చేయడం కోసం నేను మహేష్ ఉన్నామని భావిస్తున్నామన్నారు. ఆమె తన పరిమితుల్లో ఏమి చేయాలి.. ఏమి చేయకూడదనే విషయాల్లో బాగానే ఉందన్నారు నమ్రత. సితార ఎప్పుడూ లిమిట్స్ క్రాస్ చేయలేదన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ దంపతుల గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ చిన్నారి.. ఇన్స్టాగ్రామ్ వీడియోలతో పాపులర్ అయింది.
2/ 17
చిన్న వయసులోనే తనకంటూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడమేకాకుండా, తన డాన్స్ వీడియోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది మహేష్ ముద్దుబిడ్డ సితార.
3/ 17
సితార తెరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మహేష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' లోని 'పెన్నీ' సాంగ్ మ్యూజిక్ వీడియోలో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది.
4/ 17
యూట్యూబ్ లో ట్యుటోరియల్స్, ఇంస్టాగ్రామ్ వీడియోలను షేర్ చేస్తూ మల్టీ టాలెంటెడ్ కిడ్ గా పేరు సంపాదించుకుంది.
5/ 17
మహేష్ బాబు కూతురు సితారకు కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్స్తో మాయ చేస్తుంది సితార పాప.
6/ 17
మహేష్ మరియు నమ్రత ఇద్దరూ సితారకు నచ్చింది చేయడానికి తగినంత స్వేచ్ఛ ఇచ్చారని అర్థం అవుతుంది. కుమార్తె పాపులారిటీకి మీడియా అటెన్షన్ కు ఏమాత్రం భయపడలేదు.
7/ 17
ఈ క్రమంలోనే ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నమ్రత సితార గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
8/ 17
సితార విషయంలో తనకు మహేష్ కు ఎలాంటి భయాలు లేవని.. నమత్ర చెప్పారు. సితార ఇష్టపడే పనిలో ప్రోత్సహిస్తూ సంతోషపరుస్తున్నామని నమ్రత పేర్కొంది.
9/ 17
ఇప్పుడు సితారకు కేవలం తొమ్మిదేళ్లే కాబట్టి.. ఈ వయస్సులో పిల్లలకు సరైన గైడైన్స్ అవసరమని భావిస్తున్నందున.. ఈ ఫ్రీడమ్ కొన్ని పరిమితులతో ఉంటుందని నమ్రత పేర్కొంది.
10/ 17
సితారది తొమ్మిది సంవత్సరాలు వయసు కనుక తనకు ఏది మంచి ఏది చెడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే విషయాల గురించి తాను, మహేష్ తెలియజేస్తూ ఉంటామని నమ్రత తెలిపారు.
11/ 17
పిల్లలకు ఇలాంటి వయసులో తల్లిదండ్రుల గైడెన్స్ తప్పనిసరి అవసరం అది సితారకు మా నుంచి ఫుల్ సపోర్ట్ ఉందని నమ్రత తెలిపారు.
12/ 17
సితార ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయంలో ఎంతో క్లారిటీగా ఉండడమే కాకుండా తన హద్దులలో తాను ఉంటుందని, ఎప్పుడు లిమిట్స్ క్రాస్ చేయదని నమ్రత చెప్పుకొచ్చారు.
13/ 17
సితారపై నమత్ర చేసిన కామెంట్స్.. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, మహేష్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు నమ్రత సితారను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైనే జోరుగా చర్చించుకుంటున్నారు.
14/ 17
మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ '1 నేనొక్కడినే' సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మల్టీటాలెంటెడ్ అనిపించుకుంటున్న లిటిల్ ప్రిన్సెస్ సితార ను కూడా సినిమాల్లోకి తీసుకురావాలని సూపర్ స్టార్ అభిమానులు కోరుకుంటున్నారు.
15/ 17
త్వరలో సితార కూడా వెండితెరపై కనిపిస్తుందని మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
16/ 17
మహేష్ బాబు హీరో గా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమాలో ఒక పాటలో సితార కూడా మహేష్ బాబుతో కలిసి డాన్స్ చేయబోతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
17/ 17
మహేష్ సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ చిత్రి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇందులో సితారను చూసేందుకు ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.