Trivikram: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. ప్లాన్ బయటపెట్టిన త్రివిక్రమ్ టీమ్
Trivikram: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. ప్లాన్ బయటపెట్టిన త్రివిక్రమ్ టీమ్
Mahesh Babu: సంక్రాంతి పండగ వేళ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది త్రివిక్రమ్ టీమ్. ఆయన రాబోయే సినిమా గురించిన వివరాలు చెబుతూ చిత్ర హీరోయిన్లు, రిలీజ్ డేట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.
సంక్రాంతి పండగ వేళ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది త్రివిక్రమ్ టీమ్. ఆయన రాబోయే సినిమా గురించిన వివరాలు చెబుతూ చిత్ర హీరోయిన్లు, రిలీజ్ డేట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.
2/ 8
మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు కానీ.. మహేష్ ఫ్యామిలీలో విషాదాలు నెలకొనడంతో కొన్ని నెలలపాటు వాయిదా వేశారు.
3/ 8
ఇన్ని రోజుల తరవాత తిరిగి ఇప్పుడు సెట్స్ మీదకొస్తున్న త్రివిక్రమ్ టీమ్.. తాజాగా సంక్రాంతి వేళ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరత్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టు 11న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నామని చెప్పారు.
4/ 8
జనవరి 18న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుందని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఇకపోతే ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల నటించబోతున్నట్లు తెలిపారు.
5/ 8
మహేష్- త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్ డేట్స్ సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.
6/ 8
భారీ హంగులతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమాలో మలయాళ, తమిళ, హిందీ నుండి నటులను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ భారీ కాస్ట్ ఉండేలా చేసుకుంటున్నారట. అని జాగ్రత్తలతో సినిమాను తెరకెక్కిస్తున్నారట.
7/ 8
గతంలో త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకాదరణ పొందటంతో మళ్ళీ అదే కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో మహేష్- త్రివిక్రమ్ కాంబో హాట్రిక్ సక్సెస్ అందుకుంటుందని ఆశగా ఉన్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.
8/ 8
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇలా మొత్తంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.