Mahesh Babu Trivikram movie: వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్ బాబు (Mahesh Babu) అదే జోష్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ చేంజ్ అయినట్లు తెలుస్తోంది.
వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్ బాబు (Mahesh Babu) అదే జోష్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
2/ 9
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మాణంలో ఎంతో గ్రాండ్ గా ఈ సీఎంఎంను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సినిమా గురించి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్ డేట్స్ సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి.
3/ 9
ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయక ముందే వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మేరకు ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఆ తర్వాత మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లి వచ్చారు.
4/ 9
ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ ఫ్యాన్స్ నిరాశ చెందే ఓ అప్ డేట్ షికారు చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు ఆలోచనలో పడినట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాను పోస్ట్ పోనే చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
5/ 9
మహేష్ బాబు చెప్పిన డేట్‌కే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో మహేష్- త్రివిక్రమ్ కాంబో సినిమాను ఆగస్ట్ 9న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట దర్శకనిర్మాతలు.
6/ 9
భారీ హంగులతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమాలో మలయాళ, తమిళ, హిందీ నుండి నటులను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ భారీ కాస్ట్ ఉండేలా చేసుకుంటున్నారట.
7/ 9
మహేష్ బాబు కెరీర్లో 28వ సినిమాగా గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందుతోంది. తమన్ బాణీలు కడుతున్న ఈ చిత్రంలో స్క్రిప్ట్ ప్రకారం రెండో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉందట. ఇందుకోసం చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ని తీసుకున్నారని తెలిసింది.
8/ 9
గతంలో త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకాదరణ పొందటంతో మళ్ళీ అదే కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో మహేష్- త్రివిక్రమ్ కాంబో హాట్రిక్ సక్సెస్ అందుకుంటుందని ఆశగా ఉన్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.
9/ 9
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఇంతలో ఈ మూవీ పోస్ట్ పోన్ న్యూస్ చక్కర్లు కొడుతుండటం సూపర్ స్టార్ అభిమానుల్లో నిరాశ నింపుతోంది.