భారీ హంగులతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమాలో మలయాళ, తమిళ, హిందీ నుండి నటులను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ భారీ కాస్ట్ ఉండేలా చేసుకుంటున్నారట. తమన్ బాణీలు కడుతున్న ఈ చిత్రంలో స్క్రిప్ట్ ప్రకారం రెండో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉందట. ఇందుకోసం చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ని తీసుకున్నారని తెలిసింది. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది.