SSMB28: మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ఫిక్స్! జగన్ ప్రభుత్వ పథకం పేరుతో భారీ స్కెచ్..
SSMB28: మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ఫిక్స్! జగన్ ప్రభుత్వ పథకం పేరుతో భారీ స్కెచ్..
Mahesh Babu Trivikram Srinivas Movie: SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో మహేష్ బాబు కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన ఓ విషయం నెట్టింట వైరల్ అవుతోంది.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఎప్పటికప్పుడు ఆసక్తి రేకెత్తించే అప్ డేట్స్ వదులుతున్నారు.
2/ 7
SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు స్కోప్ ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు అధికారికంగా తెలిపారు.
3/ 7
అయితే సీఎం జగన్ పెట్టిన ప్రభుత్వ పథకం పేరు ఈ సినిమా టైటిల్ గా కన్ఫర్మ్ చేశారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఎప్పటిలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ’ సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తూ.. ‘అమ్మఒడి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది.
4/ 7
మొదట ఈ సినిమాకు ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్ అనుకున్న త్రివిక్రమ్.. ‘అమ్మఒడి’ అయితేనే కథకి బాగా సూట్ అవుతుందనే ఉద్దేశంలో ఉన్నారట. ఇలా మహేష్ బాబు మూవీకి జగన్ ప్రభుత్వ పథకం పేరు పెట్టారని తెలుస్తుండటం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
5/ 7
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మాణంలో ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఓ రేంజ్ హైప్ నెలకొంది.
6/ 7
మహేష్ కెరీర్ లో సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొదట ఈ సినిమాను ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు కానీ.. అనుకోని కారణాల వల్ల ఆగస్టు 11కు వాయిదా వేశారు.
7/ 7
గతంలో త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ హాట్రిక్ మూవీపై ఆశగా ఉన్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. సో.. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ కొడుతుందనేది!.