టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 28వ సినిమాగా వస్తోన్న ఈసినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించి టీమ్ ఓ వీడియోను కూడా వదిలింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. Photo Twitter
తాజాగా ఈ సినిమా నిర్మాతలు సహా దర్శకుడు త్రివిక్రమ్ లు మహేష్ తో కలిసి క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ ఫోటోలు కొన్ని బయటకి వచ్చాయి. మరి ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే సినిమా కొత్త షెడ్యూల్ కూడా ఈ జనవరి నుంచే స్టార్ట్ చేయాలనీ ఫిక్స్ చేశారట. ఇక దీనితో అయితే ఈ సినిమా యూనిట్ ఫోటోలు వైరల్ గా మారాయి
మహేష్ త్రివిక్రమ్ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఓ రేంజ్లో ఊహించుకుంటున్నారు. అయితే అదే రేంజ్లో ఈ సినిమాకు మార్కెట్ జరుగుతోందట. ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు ఓవర్ సీస్ రైట్స్ కోసం 23 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం.. Photo : Twitter
వలం దక్షిణాది నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్‌కు 100 కోట్ల వరకు కోట్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ప్రముఖ ఓటిటి సంస్థల ప్రతినిధులతో చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఇక హిందీ డబ్బింగ్‌తో పాటు డిజిటల్ రైట్స్ మాత్రం ఓ ముఫై కోట్ల రేంజ్ పలకొచ్చని తెలుస్తోంది. ఇక ఆడియో రైట్స్‌కు ఓ ఐదు కోట్లు డిమాండ్ చేయనున్నారట. Photo : Twitter Mahesh Babu SSMB28 music sittings
ఈ మూవీలో మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీకి మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ ఓ స్పెషల్ ఏజెంట్‌గా నటిస్తున్నారని, అందుకే ఫిజిక్‌ని సిద్ధం చేసుకున్నారని కూడా వినిపిస్తోంది. ఇక అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా ఏప్రిల్ 28, 2023న విడుదలకానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది Photo : Instagram