సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. 2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూసారు అభిమానులు. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసి చాలా రోజులు అయితున్న ఇప్పటికీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబును దుబాయ్‌లో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. (Twitter/Photo)
గత కొన్నేళ్లుగా మోకాళ్ల నొప్పితో బాధ పడుతున్న మహేష్ బాబు.. రీసెంట్గా స్పెయిన్‌లో మోకాళ్లకు సంబంధించిన చికిత్స తీసుకున్నారు. ట్రీట్మెంట్ తర్వాత మహేష్ బాబు .. దుబాయ్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. జనవరి నెలాఖరుకు వరకు రెస్ట్ తీసుకొని ఫిబ్రవరి నుంచి ‘సర్కారు వారి పాట’ షూటింగ్లో పాల్గొననున్నారు. మార్చి ఫస్ట్ వీక్ వరకు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఏప్రిల్ 1న ఉగాది కానుకగా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. (Twitter/Photo)
మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా కొన్నేళ్లుగా కనీసం కలవలేదనే వార్తలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇక ఎప్పటికీ కలిసి పని చేయకూడదని ఒకరినొకరు నిర్ణయించుకున్నారని.. సోషల్ మీడియాలోనూ వార్తలొచ్చాయి. అన్నట్లుగానే పదేళ్లకు పైగానే అయింది కదా ఈ ఇద్దరి మధ్య సినిమాలు వచ్చి. ఇక చేయరేమో అనుకుంటున్న సమయంలో ఇన్నాళ్లకు మళ్లీ సినిమా అనౌన్స్ చేసారు.
ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా దూరం అయిపోతున్న తరుణంలో చాలా తెలివిగా మహేష్ బాబును త్రివిక్రమ్‌తో కలిసి పని చేసేలా చేసారు. ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగేలా యాడ్స్ చేయించారు నమ్రత. ఈ పదేళ్లలో మహేష్, త్రివిక్రమ్ కలిసి సినిమాలు చేయకపోయినా కూడా యాడ్స్ బాగానే చేసారు. దాంతో మనస్పర్థలు కాస్తా తొలగిపోయాయి.
ఆ స్నేహంతోనే ఇప్పుడు మళ్లీ కలిసి పని చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పక్కనబెడితే ఇప్పుడు త్రివిక్రమ్, మహేష్ చేయబోయేది అతడు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతుంది. 2005లో వచ్చిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపు చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
కథ కూడా దాదాపు అలాగే ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు టైటిల్ కూడా ‘పార్థు’ అని పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అతడులో మహేష్ పేరు అదే. నందు అనే పాత్ర కూడా చేసినా ఎక్కువగా పార్థు పాత్రలోనే కనిపిస్తాడు మహేష్. ఒకవేళ అన్నీ కుదిరి అతడు సీక్వెల్ అయితే మాత్రం అంచనాలు మామూలుగా ఉండవు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.