టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 28వ సినిమాగా వస్తోన్న ఈసినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించి టీమ్ ఓ వీడియోను కూడా వదిలింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. Photo Twitter
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయ్యింది. అక్కడే ఓ వారం రోజులు షూట్ చేశారు. ఈ ఫస్ట్ షెడ్యూల్లో కొన్ని హై ఆక్టేన్ ఎపిక్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారట. ఇక రెండో షెడ్యూల్ దసరా తర్వాత మొదలుకానుందని తెలిపారు చిత్ర నిర్మాత నాగవంశీ.. ఈ రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ ప్రత్యేక సెట్లో షూట్ రెస్యూమ్ కానుందట. ఇక దాదాపుగా ఓ 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కిస్తున్నారట. (Twitter/Photo)
వీటితో పాటు కేవలం దక్షిణాది నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్‌కు 100 కోట్ల వరకు కోట్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ప్రముఖ ఓటిటి సంస్థల ప్రతినిధులతో చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఇక హిందీ డబ్బింగ్‌తో పాటు డిజిటల్ రైట్స్ మాత్రం ఓ ముఫై కోట్ల రేంజ్ పలకొచ్చని తెలుస్తోంది. ఇక ఆడియో రైట్స్‌కు ఓ ఐదు కోట్లు డిమాండ్ చేయనున్నారట. Photo : Twitter
థియేటర్ హక్కుల విషయానికి వస్తే నైజాం ఏరియాకే దాదాపుగా ఓ 45 కోట్ల రేంజ్లో కోట్ చేయవచ్చని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమా 42 కోట్లు వసూలు చేసింది. ఇక ఆంధ్ర 50 కోట్ల రేంజ్లో, సీడెడ్ 20 కోట్ల రేంజ్ ఉండనుందని సమాచారం. మొత్తంగా 260 నుంచి 280 వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల మాట. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈసినిమా దాదాపుగా ఐదు భాషాల్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషాల్లో ఒకేసారి వస్తున్నట్లు టాక్. ఒక వేళా అదే నిజం అయితే మొదటి మహేష్ ప్యాన్ ఇండియా సినిమా ఇదే అని అనుకోవాలి. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.. ఈ మూవీలో మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీకి మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. Photo : Instagram
ఇక తాజాగా మహేష్ బాబు చొక్కా లేని అవతారంలో ఉన్న ఒక ఫోటో ఇంటర్నెట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఇది త్రివిక్రమ్ సినిమా కోసమే అని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ షర్ట్‌లెస్‌గా ఉండబోతున్నాడనే ఊహాగానాలకు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ ఓ స్పెషల్ ఏజెంట్‌గా నటిస్తున్నారని, అందుకే ఫిజిక్‌ని సిద్ధం చేసుకున్నారని కూడా వినిపిస్తోంది. ఇక అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా ఏప్రిల్ 28, 2023న విడుదలకానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది Photo : Instagram
ఇక అది అలా ఉంటే మహేష్ బాబుతో పాటు ఈ సినిమాలో మరో యువ హీరో నటిస్తున్నట్లు ఇటీవల టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ తెలుగు నటుడు తరుణ్ నటిస్తాడని అన్నారు. కాగా తరుణ్ తాజాగా క్లారిటీ ఇస్తూ.. తాను ఎటువంటీ సినిమా చేయట్లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో తరుణ్ కాకుండా.. మలయాళీ యువ హీరో రోషన్ మాథ్యూ ఎంపికైనట్లు తెలుస్తోంది. అంతేకాదు రోషన్ ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారట. రోషన్, ఆలియా భట్ నటించిన డార్లింగ్స్, తాజాగా విడుదలైన కోబ్రా వంటి చిత్రాలలో నటించి మెప్పించారు. Photo : Instagram
ఈ కారెక్టర్ త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని.. కచ్చితంగా మహేష్ బాబు, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. మోహన్ బాబు నటించబోయే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతుంది. అంతేకాదు ఈ మూవీలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు టాక్. Photo : Instagram
ఇక మహేష్ లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట విషయానికి వస్తే.. ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించుకుంది. బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమాకు యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు ఇక ఈ సినిమా జూన్ 23న నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. . Photo : Instagram