ఇందులో ఫ్లాష్ బ్యాక్‌తో పాటు ప్రస్తుతం జరిగే సీన్స్‌ను వెరైటీ స్క్రీన్ ప్లే తో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే మహేష్ బాబు సన్నివేశాలే ఈ సినిమాకు హైలెట్ కానున్నాయట. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మరో కథానాయికగా శ్రీలీల నటించబోతున్నట్టు సమాచారం. (Twitter/Photo)
మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా కొన్నేళ్లుగా కనీసం కలవలేదనే వార్తలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇక ఎప్పటికీ కలిసి పని చేయకూడదని ఒకరినొకరు నిర్ణయించుకున్నారని.. సోషల్ మీడియాలోనూ వార్తలొచ్చాయి. అన్నట్లుగానే పదేళ్లకు పైగానే అయింది కదా ఈ ఇద్దరి మధ్య సినిమాలు వచ్చి. ఇక చేయరేమో అనుకుంటున్న సమయంలో ఇన్నాళ్లకు మళ్లీ సినిమా చేస్తున్నారు.